కడుపు మాడ్చుకుంటున్న ప్రియాంక
తమ తోటి స్టార్స్ కంటే మంచి పేరు తెచ్చుకోవడం కోసం, తాము పోషించబోయే పాత్ర కోసం రిస్కుకు వెనకాడకుండా వైవిధ్యమైన చర్యలకు దిగుతూ సినిమాలోని పాత్రలో సహజత్వం ఉట్టి పడాలే తెగ కష్ట పడుతున్నారు నేటి హీరో హీరోయిన్లు. హీరో అమీర్ ఖాన్ సహా ఇతర టాప్ హీరోలు సినిమాకు తగిన విధంగా తన బాడీనీ మెల్ట్ చేసుకోవడం, తెగ కష్ట పడి వర్కౌట్లు చేయడం లాంటివి చేస్తున్నారు. కరీనా, కత్రినా లాంటి వారు కూడా ఇలాంటి విషయాల్లో తక్కువేమీ కాదు. తాజాగా ప్రియాంక చోప్రా కూడా తన పాత్ర కోసం రిస్క్ చేసేందుకు రెడీ అయింది. అది కూడా వారికంటే వైవిద్యంగా మూడు రోజుల ఉపవాస దీక్షకు సిద్ధమవుతోంది.
ఉపవాసం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే...అనురాగ్‌బసు దర్శకత్వంలో ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'బర్ఫీ" చిత్రం ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ప్రియాంక పాత్ర ఓ మూడు రోజులు ఓ గదిలో బంధీ అయిపోయి అన్నపానీయాలు ముట్టుకోకుండా గడుపుతుందట. పాత్రలో సహజత్వం ఉట్టి పడేందుకు, తన మొహంలో నీరసం ఛాయలు రియల్ గా కనిపించడం కోసమే ఈ ఫీట్ చేయాలని నిర్ణయించుకుందట. వాస్తవానికి....నీరసం తాలూకు ఛాయల్ని మేకప్ టెక్నిక్‌ను ఉపయోగించి ముఖంలో ప్రతిఫలించేలా చూపించడం సినిమాల్లో మామూలుగా జరిగే తంతు.
అయితే ఈ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్న ప్రియాంక తను మూడు రోజులు పాటు ఉపవాసం చేస్తానని చెప్పింది. అంతేకాదు ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ కాదని క్యారెక్టర్‌లో రియల్‌ఫీల్ రావాలంటే ఉపవాసం తప్పనిసరని వాదించిందట. సరైన విజయాలు లేక గత టాప్ ప్లేస్ నుంచి కిందకి దిగజారిని ప్రియాక మళ్లీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవడానికే ఇలాంటి పీట్లు చేస్తుందని, ఇలాంటి వాటి వల్ల పబ్లిసిటీ తో పాటు మంచి పేరు కూడా వస్తుందనేది ఆమె ఆలోచన అని బాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











