twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొద్దిగా మందుకొట్టా, ఎక్కేసింది.. మేకప్‌మాన్‌కి చుక్కలు.. టాక్సీవాలా హీరోయిన్!

    |

    చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రం ఎట్టకేలకు నవంబర్ 17న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. హర్రర్, రొమాంటిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ప్రచార కార్యక్రమాల నేపథ్యంలో ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ప్రియాంక జవాల్కర్ పలు ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది.

    అనంతపూర్ పిల్ల అంటూ

    అనంతపూర్ పిల్ల అంటూ

    ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ప్రియాంక జవాల్కర్ ని పరిచయం చేస్తూ ఈమె అనంతపూర్ పిల్ల అని ప్రస్తావించాడు. ప్రియాంక జవాల్కర్ మరాఠి అమ్మాయి అయినప్పటికీ అనంతపూర్ లోపెరిగింది. తెలుగు చాలా స్పంష్టంగా మాట్లాడుతోంది. లుక్స్ పరంగా కూడా ఆకట్టుకుంటోంది.

    సినిమా అవకాశం గురించి

    సినిమా అవకాశం గురించి

    ప్రియాంక జవాల్కర్ గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆ తరువాత ఉన్నత చదువులకోసం యూఎస్ వెళ్లిపోయానని ప్రియాంక తెలిపింది. అక్కడ నన్ను చూసిన తెలుగువారంతా షార్ట్ ఫిలిం నటి కదా అంటూ గుర్తుపట్టేవారు. హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయలేదు అని అడిగారు.

     ఆరు నెలల్లోపే

    ఆరు నెలల్లోపే

    మరోమారు ఇండియా వచ్చి సినిమా అవకాశాలు కోసం ప్రయత్నించానని ప్రియాంక తెలిపింది. ఈ సారి మాత్రం 6 నెలల్లోపే టాక్సీవాలా చిత్రంలో ఛాన్స్ వచ్చిందని ప్రియాంక వివరించింది. కానీ సినిమా విడుదల కావడానికే 2 ఏళ్ళు పట్టిందని ప్రియాంక తెలిపింది.

    మద్యం తాగి

    మద్యం తాగి

    టాక్సీవాలా చిత్రంలో ఓ సన్నివేశంలో నేను మద్యం మత్తులో ఉన్నట్లు నటించాలి. ఒరిజినాలిటీ కోసం నిజంగానే మందు కొట్టానని ప్రియాంక తెలిపింది. తాగింది కొద్దిగానే అయినా తొలిసారి కావడంతో పూర్తిగా ఎక్కేసిందని ప్రియాంక సరదాగా వ్యాఖ్యానించింది. మత్తు దిగేవరకు నవ్వుతూనే ఉన్నా. నన్ను కంట్రోల్ చేయడానికి మేకప్ మాన్ చాలా ఇబ్బంది పడ్డారని ప్రియాంక తెలిపింది.

     తెలుగు హీరోయిన్లు అయితే

    తెలుగు హీరోయిన్లు అయితే

    టాలీవుడ్ చిత్రాల్లో తెలుగు హీరోయిన్లు ఉంటే బావుంటుంది. కానీ నటీనటుల్ని ఎంపిక చేసుకోవాల్సింది దర్శకుడు. పరభాషా హీరోయిన్లు ఈ పాత్రలో ఫిట్ అవుతారని అనిపిస్తే వారినే తీసుకుంటారు. అందులో ఎలాంటి తప్పు లేదని ప్రియాంక అభిప్రాయపడింది. టాక్సీవాలా చిత్రం విడుదలయ్యాక తనకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపింది.

    English summary
    Priyanka Jawalkar about her drinking experience in Taxiwaala movie. Reveals funny incidents in the sets
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X