ప్రియాంక, క్రతినా డ్యాన్సులు అసందర్భం: కరినా
ఒకప్పుడు ఐటం సాంగులు చేయడానికి ప్రత్యేకంగా కొందరు తారలుండే వారు. కానీ ఇప్పడు ట్రెండు మారింది...కరినా, కత్రినా, ప్రియాంక లాంటి రెగ్యులర్ హీరోయిన్లతో పాటు కొందరు హీరోలు కూడా ఐటం నంబర్లు చేస్తున్నారు. హీరోయిన్ల విషయానికొస్తే ఐటం సాంగుల విషయంలో అందరి కంటే ముందుంది కరినా కపూర్.
గతంలో పలు సినిమాల్లో గెస్టు పాత్రల రూపంలో ఐటం నంబర్లు చేసిన కరినా...మరికొన్ని సినిమాల్లోనూ ఇలాంటి పాత్రలతోనే వెండి తెరపై దర్శనం ఇవ్వబోతోంది. బాడీగార్డు సినిమాలో సల్మాన్ ఖాన్ తో, రా.వన్ లో షారుఖ్ ఖాన్ తో , ఏజెంట్ వినోద్ లో సైఫ్ అలీఖాన్ తో కలిసి ఐటం సాంగుల్లో అదర గొట్ట బోతోంది. ఈ సినిమాల్లో గెస్ట్ రోల్ చేస్తున్న కరినాకు ఆమె పత్యర్థులు అయిన కత్రినా, ప్రియాంక చోప్రాలు హీరోయిన్లుగా నటిస్తూ గట్టి పోటీనిస్తున్నారు.
ఇదే విషయమై ఆమెను ప్రశ్నిస్తే...వారితో నన్ను పోల్చడం ఏమిటి?..వారికి నాకు పోటీ ఏమిటి? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. నేను గెస్టు పాత్రలు చేస్తున్నా.. అవి కథానుగుణంగా అతి ముఖ్యమైనవి. కథలో భాగంగానే నాపై ఐటం నంబర్లు ప్లాన్ చేస్తున్నారు. క్రతినా, ప్రియాంక లాంటి హీరోయిన్లు గతంలో ఐటం నంబర్లు చేసినా అవి కథకు అనుగుణంగా కాకుండా అసందర్భంగా ఉన్నాయని అంటోంది. వాళ్లలా కథతో సంబంధం లేకుండా చేయడం నా వల్ల కాదు, సందర్భ సహితంగా ఉంటేనే నేను గెస్ట్ రోల్స్, ఐటం నంబర్లు చేయడానికి ఒప్పకుంటానని అంటోంది.


Click it and Unblock the Notifications











