‘గే’ లతో ఎంజాయ్ చేయనున్న కత్రినా!
'గే'లతో ఎంజయ్ చేసే అవకాశం దక్కింది బాలీవుడ్ కత్తిలాంటి ఫిగర్ కత్రినా కైఫ్ కి. అప్పట్లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో యష్ జోహార్, కరణ్ జోహర్ నిర్మించిన చిత్రం 'దోస్తానా' మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అభిషేక్, జాన్ అబ్రహంలను గేలుగా భావించి వారితో తెగ ఎంజాయ్ చేస్తుంది ప్రియాంక. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోంది. ఈ సారి సినిమాలలో గే పాత్రలతో ఎంజాయ్ చేసే అవకాశం కత్రినా కైఫ్ దక్కించుకుందని తెలుస్తోంది.
ఈ సీక్వెల్‌లోనూ అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం నటించనున్నారు. ఈ చిత్ర విశేషాలను కరణ్ జోహర్ తెలియజేస్తూ 'దోస్తానా' చిత్రానికి కొనసాగింపుగా 'దోస్తానా-2' చిత్రాన్ని నిర్మించనున్నాం. తొలి భాగానికి దర్శకత్వం వహించిన తరుణ్‌మన్సుఖాని ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తాడు. స్క్రిప్ట్ పూర్తయింది. ఇందులో నటించడానికి అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం ఇద్దరూ రెడీగా వున్నారు. ఈ చిత్రం సెట్స్‌కు వెల్లడానికి అంతా సిద్ధం. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలు పెడతాం' అని తెలిపాడు. అయితే కత్రినా హీరోయిన్ అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బయటకు చెప్పక పోయినా ఆమెనే అనుకుంటున్నట్లు బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











