'సెవన్ హజ్బెండ్స్' ని ఏక్సెప్ట్ చేసిన స్టార్ హీరోయిన్
మొదటి నుంచీ ప్రియాంక చోప్రాది సెపరేట్ రూటు. మొన్నా మధ్య 'వాట్స్ యువర్ రాశీ?' సినిమాలో 12పాత్రలు పోషించిన ఆమె తాజాగా 'సెవన్ హజ్బెండ్స్' అంటూ మరో ప్రయోగం చేయనుంది. ప్రముఖ దర్శకుడు విశాల్ భవద్వాజ్ రూపొందించనున్న ఈ చిత్రలో టైటిల్ కు తగ్గట్లే ఆమె ఏడుగురు భర్తలతో కనువిందు చేయనుంది. అయితే వారందరితో ఆమె కాపురం చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ అంటున్నారు దర్శక, నిర్మాతలు. ఇక ఈ విచిత్రమైన కథను భరద్వాజ్, రస్కిన్ బాండ్ కలపి తయారు చేసారు.
ప్రియాంకను పెళ్ళాడబోయే భర్తలలో ఒకరు మోహన్ లాల్. మిగతా వారు ఎవరన్నది త్వరలో ప్రకటిస్తామంటున్నారు. తమిళ, తెలుగు నుంచి కూడా హీరోలను ఎంపిక చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఆ రకంగా ఇక్కడ మార్కెట్ కూడా సంపాదించవచ్చననే ఆలోచన ఉందిట. ఇక ఈ చిత్రానికి మొదట ప్రియాంక చోప్రా నో చెప్పింది. అయితే విశాల్ భరద్వాజ్ కథ పూర్తిగా చెప్ప కన్వీన్స్ చేసిన తర్వాత రెండు రోజులు ఆలోచించి ఓకే చేసింది.


Click it and Unblock the Notifications











