ఇక ద్వాదశావతారం

By Staff

Priyanka Chopra
కమల్ హాసన్ 'దశావతారం'చిత్రంలో పది పాత్రలు పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఆ రికార్డును అధిగమించబోతోంది. ఆమె కొత్తగా కమిట్ అయిన 'వాట్స్‌ యువర్‌ రాశీ' చిత్రంలో పన్నెండు పాత్రలు చేయబోతోంది.

జ్యోతిషం ఆధారంగా అల్లిన కథతో అశుతోష్‌ గోవరికర్‌('లగాన్‌', 'స్వదేశ్‌', 'జోధా అక్బర్‌') ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నాడు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక పోషించే పాత్రలు పన్నెండు రాశుల చిహ్నాలను ప్రతిబింబిస్తాయని సమాచారం. అలాగే ఈ చిత్రం ఓ రొమాంటిక్‌ కామెడీగా రూపొందనుంది. ఈ చిత్రంలో వచ్చే ఓ పాటను దాదాపు ఇరవై రెండు గంటల పాటు నిర్విరామంగా చిత్రీకరించారు. ఈ పాటలో అన్ని ప్రియాంక చేస్తున్న పన్నెండు పాత్రలు నృత్యం చేస్తాయి. అందుకే వైవిధ్యం కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు పాటించారు.

ప్రియాంక కూడా ఏ పాత్రకు తగ్గ ముఖ కవళికల్ని ఆ పాత్రకు ఆపాదిస్తూ ఆద్యంతం పాట రక్తి కట్టేలా నృత్యం చేశారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక మాజీ ప్రియుడు హార్మన్‌ బవేజా హీరో.గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 'లవ్‌ స్టోరీ 2050' చిత్రం వచ్చింది. ఈ పాటలో ఆయన కనిపించకపోయినా...షూటింగ్‌ జరిగేటపుడు అక్కడే ఉండి ఎంతగానో ఉత్సాహపరిచారని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.అమెరికాలో స్థిరపడ్డ గుజరాతీ రచయిత మధు రే రాసిన 'కింబల్‌ రావెన్స్‌వుడ్‌' నవల ఈ చిత్రానికి ఆధారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X