రామ్ చరణ్ ‘జంజీర్’ సెట్స్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ బాలీవుడ్ కెరీర్ ను నిర్ణయించే సినిమా కావడంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్.

దర్శకుడు అపూర్వ లఖియాతో చరణ్, ప్రియాంక

హైదరాబాద్ లో చివరి రోజు షూటింగ్ ముగిసిన అనంతరం ఫోటోలకు ఫోజు ఇచ్చిన యూనిట్ సభ్యులు

జంజీర్ షూటింగ్ నమిత్తం హైదరాబాద్ వచ్చిన ప్రియాంక.

సెట్స్ లో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్ పై సీన్ చిత్రీకరిస్తున్నప్పటి దృశ్యం
ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











