మళ్లీ విడిపోయిన బాలీవుడ్ జంట షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా
కాంప్లికేటెడ్ బాలీవుడ్ కపుల్ షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా మళ్లీ విడిపోయారు. ఆ జంట పబ్లిగ్గా అంతగా ముందుకు రాకుండానే మళ్లీ విడిపోయింది. గత కొంత కాలంగా వారిద్దరు డేటింగ్ చేస్తున్నారు. అయితే, విడిపోవాలని వారు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారట. అయితే, వారిద్దరి మధ్య ఏ గొడవలూ జరగలేదని, పరస్పర అవగాహనతోనే విడిపోయారని టాబ్లాయిడ్స్ కోడై కూస్తున్నాయి. ఇద్దరికీ ఒక్కరంటే మరొకరికి ఎంతో ఇష్టమని, వారు రిలేషన్ షిప్ లో ఉండగా పరిస్థితులు ముంచుకొచ్చాయని, దాంతో విడిపోక తప్పలేదని అంటున్నారు. కానీ, ఇద్దరికీ జీవితం పట్ల ఉన్న దృక్పథాలు వేరు, కెరీర్ కూడా వేరే. దాంతో ఇద్దరికీ కుదరలేదట. కొద్ది నెలల క్రితమే వారి మధ్య సంబంధం ప్యాచప్ అయింది. అంతలోనే మళ్లీ విడిపోయారు. పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియదనే తమ సంబంధానికి ఎక్కువ ప్రచారం కల్పించుకోలేదని చెబుతున్నారు.
అయితే, వారి సంబంధం అంత సాఫీగా తెగిపోలేదని అంటున్నారు. బ్రెజిల్ లో ఖాత్రూన్ కీ ఖిలాడీ సినిమా షూటింగ్ ముగించుకుని వచ్చిన తర్వాత తరుచుగా ఇరువురి మధ్య గొడవలు జరిగాయని వినికిడి. ప్రియాంక నటించిన అంజానా, అంజానీ సినిమా విడుదల సందర్భంగా ఇద్దరు కలుసుకున్నా ఒకరినొకరు చూసుకోవడానికి, పలకరించుకోవడానికి ఎక్కడలేని ఇబ్బంది పడ్డారట.


Click it and Unblock the Notifications











