బ్లూ ఫిల్మ్ తారతో... రామ్ చరణ్ హీరోయిన్?
ముంబై: కొన్ని సంవత్సరాల పాటు హాట్ హాట్‌గా ప్రేమాయణాన్ని సాగించిన జంట జాన్ అబ్రహం-బిపాషా బసు. గత సంవత్సరం వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం విడిపోయిన జాన్, బిపాషా ఇద్దరూ ఏక్తాకపూర్ నిర్మిస్తున్న 'షూటౌట్ ఎట్ వాదాల' అనే చిత్రంలో కలిసి నటించబోతున్నారనే వార్తలు వినిపించాయి.
బిపాసా ఈ చిత్రంలో ఐటం సాంగు చేస్తుందని అనుకున్నప్పటికీ జాన్ నో చెప్పడంతో ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాతో ఐటం సాంగు చేయించడానికి ప్లాన్ చేస్తున్నారట. కత్రినా, కరీనా లాంటి వారు కూడా ఐటం సాంగులతో హల్ చల్ చేస్తుండటంతో ప్రియాంక కూడా ఈ చిత్రంలో ఐటం సాంగు చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా... ఈ చిత్రాన్ని మరింత శృంగార భరితంగా మార్చేందుకు నిర్మాత ఏక్తా కపూర్ బ్లూ ఫిల్మ్ తార సన్నీ లియోన్‌తో మరో ఐటం సాంగు చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్. 'షూటౌట్ ఎట్ వాదాల' చిత్రంలో జాన్ అబ్రహం, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లు.
ప్రియాంక చోప్రా మరో వైపు మన తెలుగు హీరో రామ్ చరణ్‌కు జోడీగా 'జంజీర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోయిన్, బ్లూఫిల్మ్ తార సన్నీ లియోన్ ఒకే సినిమాలో ఐటం సాంగులు చేయబోతుండటం చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











