వరుణ్ సందేశ్ 'క్యారెక్టరా బొంగా'(సెన్సార్)
వరుణ్ సందేశ్ తాజా చిత్రం ప్రియుడు ప్రియుడు చిత్రాన్ని 5 గురు సభ్యులతో కూడిన 'ఇసి' చూసి 6 కట్స్‌తో 29.11.11న 'యుఎ' సర్టిఫికెట్ జారీచేసింది.3975.26 మీటర్ల నిడివిగల 'ప్రియుడు' చిత్రం 3.12.11న విడుదలయింది.
1. ఒకటి రెండు రీళ్ళలో 'లవ్లో పరేషాన్' పాటలో గల 'ఒబామాకి రుబాబంతా దిగిపోదా' అనే వాక్యాన్ని తొలగించారు.
2. తలమీద బాటిల్ పగలగొట్టే దృశ్యాన్ని తొలగించారు. 2, 7, 12 రీళ్ళలో కూడా ఉన్న ఈ
దృశ్యం తొలగింపుకు గురైంది అయిదవ రీలులో
3. 'క్యారెక్టరా బొంగా' అన్న డైలాగ్‌లో 'బొంగా' తొలగించారు.
4. అలీ చెప్పిన 'ఎక్కడైనా రాసుకో' కత్తెర పాలైంది.
5. ఏడు, పది రీళ్ళలోని ''నీయబ్బ'' పదం కత్తెర పాలయింది.
6. ఎనిమిదవ రీలులో హీరో ఫ్రెండ్ పలికిన ''మూసుకొని పనిచెయ్''
డైలాగ్ తొలగించారు.
వరుణ్ సందేశ్, ప్రీతికారావు, శ్వేతబసు ప్రసాద్, కోట, నాజర్, రణ్‌ధీర్, సురేఖావాణి, ప్రగతి నటించిన చిత్రం 'ప్రియుడు'. యు.కె.ఎవెన్యూస్ పతాకాన పి.ఉదయ్‌కిరణ్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రావణ్. ఈ చిత్రం మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుని భాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.


Click it and Unblock the Notifications











