ఇద్దరు ముద్దుగుమ్మల ముద్దుల ‘ప్రియుడు’
వరుణ్ సందేశ్, ప్రీతికారావు, శ్వేతబసు ప్రసాద్ హీరో హీరోయిన్ లుగా రూపొందుతున్న చిత్రం 'ప్రియుడు". శ్రావణ్ దర్శకత్వంలో యుకె ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'ఇటీవల హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తయింది. బ్యాంకాక్ లో చిత్రీకరించిన పాటలు, సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుంటాయి. నేటి తరం నచ్చే ఈ ప్రేమకథలో అన్ని భావోద్వేగాలు వుంటాయి. నేటి యువతరం ప్రతినిధిగా వరుణ్ సందేశ్ కనిపిస్తాడు.
ప్రేమకథా చిత్రాల్లో విభిన్నంగా అనిపించే నవ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం వుంటుంది. అక్టోబర్ మొదటివారంలో గీతాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. కోట శ్రీనివాసరావు, నాజర్, కాశీ విశ్వనాథ్, అలీ, రణధీర్, వెన్నెల కిషోర్, విజయ్, ప్రభాస్ శ్రీను, మెల్కోటే, తాగుబోతు రమేష్, ప్రగతి, భావన, సురేఖావాణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మోహన్ జోనా, పాటలు: చంద్రబోస్ అందించారు.


Click it and Unblock the Notifications











