twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాంకాక్ చుట్టొచ్చిన ప్రియుడి రొమాన్స్

    By Sindhu
    |

    'కొత్త బంగారులోకం" చిత్రంలో జతకట్టిన వరుణ్‌ సందేశ్, శ్వేతబసు ప్రసాద్‌ లు మరో చిత్రంలో నటిస్తున్నారు. 'ప్రియుడు" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రీతికారావు ప్రధాన కథానాయిక. శ్రావణ్ దర్శకత్వంలో యుకె ఎవెన్యూస్ ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై ఉదయ్‌ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్‌ లో పాటల చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ' జూలై 24 నుంచి ఆగస్టు 7 బ్యాంకాక్, పటాయదీవులు, చెగ్మయ్‌ లో వరుణ్‌ సందేశ్, ప్రీతికారావు, శ్వేతబసు ప్రసాద్‌ లపై మూడు పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ చేస్తున్నాం.

    ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది" అన్నారు యూత్‌ ఫుల్ లవ్ ఎంటర్‌ టైనర్‌ గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో లవ్‌ ఫీల్ ఫ్రెష్‌ గా వుంటుందని, కుటుంబ భావోద్వేగాలకు పెద్ద పీట వేశామని దర్శకుడు చెప్పాడు. కోట శ్రీనివాసరావు, నాజర్, కాశీ విశ్వనాథ్, అలీ, రణధీర్, వెన్నెల కిషోర్, విజయ్, ప్రభాస్ శ్రీను, మెల్కోటే, తాగుబోతు రమేష్, ప్రగతి, భావన, సురేఖావాణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మోహన్‌ జోనా, నిర్మాత: ఉదయ్‌కిరణ్, కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం-మాటలు: శ్రావణ్.

    English summary
    Varun Sandesh,Preetika Rao in the main lead roles forthcoming movie Priyudu is busy in shooting. Priyudu movie has finished its Bangkok shooting schedule where songs have been picturised under the guidance of Raghu & Nixon. Priyudu fresh schedule to begin in Hyderabad from August 16th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X