Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బ్యాంకాక్ చుట్టొచ్చిన ప్రియుడి రొమాన్స్
'కొత్త బంగారులోకం" చిత్రంలో జతకట్టిన వరుణ్ సందేశ్, శ్వేతబసు ప్రసాద్ లు మరో చిత్రంలో నటిస్తున్నారు. 'ప్రియుడు" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రీతికారావు ప్రధాన కథానాయిక. శ్రావణ్ దర్శకత్వంలో యుకె ఎవెన్యూస్ ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్ లో పాటల చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ' జూలై 24 నుంచి ఆగస్టు 7 బ్యాంకాక్, పటాయదీవులు, చెగ్మయ్ లో వరుణ్ సందేశ్, ప్రీతికారావు, శ్వేతబసు ప్రసాద్ లపై మూడు పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ చేస్తున్నాం.
ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది" అన్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో లవ్ ఫీల్ ఫ్రెష్ గా వుంటుందని, కుటుంబ భావోద్వేగాలకు పెద్ద పీట వేశామని దర్శకుడు చెప్పాడు. కోట శ్రీనివాసరావు, నాజర్, కాశీ విశ్వనాథ్, అలీ, రణధీర్, వెన్నెల కిషోర్, విజయ్, ప్రభాస్ శ్రీను, మెల్కోటే, తాగుబోతు రమేష్, ప్రగతి, భావన, సురేఖావాణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మోహన్ జోనా, నిర్మాత: ఉదయ్‌కిరణ్, కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం-మాటలు: శ్రావణ్.