సన్నీలియోన్ షో రద్దు చేయండి .. లేకపోతే సామూహిక ఆత్మహత్యలే.. సీరియస్ వార్నింగ్
Recommended Video

బెంగళూరులో జరుగనున్న సెక్స్‌బాంబ్ సన్నీలియోన్ షో రచ్చ రచ్చగా మారింది. నగరంలో సన్నీలియోన్ షోను ఏర్పాటు చేస్తే సహించేది లేదు. ఎంతకైనా తెగిస్తాం అని కర్ణాటక రక్షణ వేదిక యువ సేన హెచ్చరించింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మన్యాత టెక్ పార్కులో సన్నిలియోన్ షో ఏర్పాటు చేశారు. సన్ని షోను వ్యతిరేకిస్తూ ఓ వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది.

సన్నిలీయోన్ షోను రద్దు చేయాలి
డిసెంబర్ 31న సన్నిలీయోన్ షోను రద్దు చేయాలి. లేకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకొంటాం అని కర్ణాటక రక్షణ వేదిక యువసేన సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం నిరసనకారులు సన్నిలియోన్ పోస్టర్లను దగ్ధం చేశారు. ఇలాంటి అసభ్యకరమైన ప్రదర్శనను కన్నడ సంస్కృతికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు.

అర్ధనగ్నంగా సన్నీలియోన్
పొట్టి దుస్తులు ధరించే సన్నిలియోన్‌ను వ్యతిరేకిస్తాం. ఒకవేళ చీర ధరించి షోలో పాల్గొనే మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము కూడా ప్రదర్శనకు వెళ్లి చూస్తాం అని యువ సేన సభ్యులు పేర్కొన్నారు.

సన్నీలియోన్ వివాదాస్పద వ్యక్తి
సన్నీలియోన్‌ను మంచి చరిత్ర లేదు. ఆమె జీవితం అంతా వివాదాస్పదం. అలాంటి వ్యక్తిని మేము ప్రోత్సాహించం. మా నిరసనను పట్టించుకోకుండా డిసెంబర్ 31న ప్రదర్శనను నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకొంటాం. 20 జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తాం అని యువ సేన సభ్యుడు హరీష్ వెల్లడించారు.

మాది ఫ్యామిలీ షో
ఇదిలా ఉండగా, మేము నిర్వహించేది ఫ్యామిలీ కార్యక్రమం. అందులో కన్నడ పాటకు సన్నీలియోన్ డ్యాన్స్ చేస్తున్నది. కన్నడ సంస్కృతికి ఎలాంటి భంగం కలుగకుండా మేము చర్యలు తీసుకొన్నాం. అసభ్యకరమైన పాటలు, నృత్యాలు మా ప్రదర్శనలో ఉండవు అని షో నిర్వాహకులు వెల్లడించారు.

సన్నీకి బెంగళూరు అంటే ఇష్టం
నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాల్లో పాల్గొనాలని చాలా మంది సన్నిలియోన్‌కు ఆఫర్లు ఇచ్చారు. అయితే బెంగళూరు, హైదరాబాద్‌లో మాత్రమే షోలో పాల్గొనాలని సన్నిలియోన్ నిర్ణయం తీసుకొన్నది. ఎందుకంటే ఆమెకు ఈ రెండు ప్రాంతాలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

ఇలా ఎందుకు చేస్తున్నారో..
నిరసన కారులు ఎందుకు ఇలా వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారో తెలియదు. సన్నిలియోన్ వల్ల రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వారు చెప్పారు. కాగా కన్నడ చిత్రం డీకేలో సన్నిలియోన్ నటించింది. శేషమ్మ అనే పాటలో ఆమె డ్యాన్స్ చేసింది.


Click it and Unblock the Notifications











