»   » బాలకృష్ణ చేతికి వాపు...అయినా

బాలకృష్ణ చేతికి వాపు...అయినా

Posted By:
Subscribe to Filmibeat Telugu
విశాఖపట్నం : బోయపాటి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో బాలకృష్ణకు ఎడమ చేయి మణికట్టు బెణికింది. అక్కడ వాపు రావడంతో ఆయన ఫిజియో థెరపిస్టును సంప్రదించారు. ఎక్స్‌రే తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పార్క్ హోటల్‌లో బసచేసిన బాలకృష్ణ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఆయన బీచ్ రోడ్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగంగా బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బైక్‌పై విన్యాసాలను ఆర్కే బీచ్ రోడ్డులో చిత్రీకరించారు.

సినిమా వివరాల్లోకి వెళితే...వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.

ఈ చిత్రం కోసం రూ. 20 లక్షల ఖర్చుతో హార్లే డేవిడ్‌సన్ బైకు ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సినిమాలోని ఓ పాటలో బాలయ్య ఈ బైకుపై కనిపించనున్నారు. బాలయ్య స్వయంగా కోరడంతో పసుపురంగు బైకును కొనుగోలు చేసారట. ఆయన ప్రత్యేకంగా పసుపు రంగు ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి తెలుగు దేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలు పెట్టనున్న బాలయ్య తన రాజకీయ ప్రవేశానికి గుర్తుగానే ఈ పసుపు రంగు బైకును ఎంచుకున్నట్లు తెలుస్తోంది

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని టాక్.

English summary

 A source from the production team of Legend, Balakrishna fall sick in shooting today. After Medical tests he continued shooting. irector Boyapati Srinu, who has earlier worked with Balakrishna in Simha, has written the script and is directing the actor again in the film Legend for the second time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu