For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమస్యలున్నాయి, అందుకే పెళ్లిపై మాటమార్చిన అసిన్!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: హీరోయిన్ అసిన్ త్వరలో బిజినెస్ మేన్ రాహుల్ వర్మను వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ తేదీ ఫిక్సయిందని, నవంబర్ 26న ఢిల్లీలో జరగనుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసిన్ ఖండించింది. ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదని తెలిపింది.

  'ఇది నిజంగా నవ్వు తెప్పించే వార్త. మేమింకా ముహూర్తమే పెట్టుకోలేదు. నా పెళ్లి తేదీపై మీడియా గందరగోళం సృష్టిస్తోంది. నేను అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాతే మా పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఎప్పుడనేది నేను చెప్పేవరకు ఓపిక పట్టండి' అని అసిన్ కోరింది.

  Problems behind Asin marriage!

  అయితే తొలుత అసిన్-రాహుల్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకన్న మాట వాస్తవమే అని, అయితే అసిన్ అప్పటికే కమిటైనప కొన్ని వాణిజ్య ప్రకటనల కాంట్రాక్టులకు సంబంధించి సమస్యలు ఉండటంతో పెళ్లి డేట్ విషయంలో అసిన్ మాట మార్చినట్లు సమాచారం. ఆ సమస్యలు క్లియర్ అయిన తర్వాత పెళ్లి డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

  అసిన్ పెళ్లాడబోతున్నది మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మ కావడంతో మీడియా వీరి పెళ్లిపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. అందుకే అసిన్, రాహుల్ తమ పెళ్లి విషయంలో గోప్యత పాటిస్తున్నారు.

  ప్రేమ వ్యహారం...
  అసిన్ ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ప్రేమ ఎలా పుట్టింది, పెళ్లికి దారి తీసిన పరిణామాలు వివరించింది. తమ మధ్య బంధం బలపడటానికి కారణం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అనే అసిన్ చెప్పుకొచ్చారు. రాహుల్, అక్షయ్ స్నేహితులు కావడమే ఇందుకు కారణం అంటోంది. అంతే కాదు తమ మధ్య సంథింగ్ మొదలైందని అక్షయ్ మొదట్లోనే కనిపెట్టేసి ప్రోసీడ్ అన్నాడట.

  Problems behind Asin marriage!

  రాహుల్ శర్మతో పరిచయం, ప్రేమ వ్యవహారం అనుకోకుండా జరిగిందని అసిన్ తెలిపారు. గజిని సినిమాలోలానే నా జీవితంలో జరిగింది. తొలిసారి ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నామని తెలిపారు. తొలుత నన్ను హాయ్ అంటూ పలకరించారు. తర్వాత విమానంలో పక్క పక్కనే కూచున్నాం. అప్పటి నుండి ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం అని అసిన్ తెలిపారు. ఒకానొక రోజు అతడే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇంట్లో వాళ్లను కలుస్తా. పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అతను జంటిల్మెన్‌లా ప్రపోజ్ చేసిన తీరు నచ్చిందని అసిన్ చెప్పుకొచ్చింది.

  సౌత్ లో అసిన్ కు బాగా పేరు తెచ్చిన సినిమా ‘గజిని'. సౌత్ లో ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా... ఇదే సినిమాను బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో హీరో మొబైల్ కంపెనీ యజమాని. నిజ జీవితంలోనూ అసిన్ మొబైల్ కంపెనీ యజమానితో ప్రేమలో పడటం కాకతాళీయమే.

  అచ్చం గజినీ సినిమాలో హీరోకు ఉన్న లక్షణాలే తనకు కాబోయే భర్తుకు ఉన్నాయంటోంది అసిన్. రాహుల్ గజిని టైపే. గజినిలో సంజయ్ సింఘానియా (సూర్య) ఓ మొబైల్ కంపెనీ ఓనర్. తర్వాత మతిమరుపు గజినిగా కనిపిస్తాడు. అందులో ఆరెంజ్ కలర్ కార్ ని వాడతాడు. ఇవన్నీ రాహుల్ నిజజీవితంలోనూ ఉన్నాయని అంటోంది అసిన్.

  English summary
  Problems behind Asin marriage. Asin categorically denies is that she is marrying on November 26 in the capital.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X