'దేవుడు చేసిన మనుషులు'గ్యారెంటీ సూపర్ హిట్

By Srikanya

హైదరాబాద్ : రవితేజ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం సెన్సార్ పనుల్ని పూర్తిచేసుకుని ఈ నెల 15న విడుదలకు సిద్ధమయింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ "మా సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. రఘు కుంచె సంగీత సారథ్యంలో రూపొంది ఇటీవల విడుదలైన ఆడియో చాలా పెద్ద హిట్టయింది. ఇప్పటివరకు రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా హిట్టవడమే కాకుండా సినిమాలు కూడా పెద్ద హిట్టయ్యాయి. అదే తరహాలో ఈ సినిమా ఆడియో సూపర్ హిట్టవడంతో, సినిమా కూడా అదే తరహాలో హిట్టవుతుందనే నమ్మకం ఉంది. మా బేనర్‌లో కచ్చితంగా మరో సూపర్‌హిట్‌గా నిలుస్తుంది'' అని చెప్పారు.

ఈ చిత్రం గురించి పూరీ జగన్నాధ్ మాత్రం ..దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు. అలాగే చిత్రం పొగ్రెస్ వివరిస్తూ...ఇటీవల బ్యాంకాక్‌లో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం అన్నారు.

రవితేజ సరసన ఇలియానా నాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతి రాణా, మానస, గాబ్రియేల్ బర్తాంతే తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఫైట్స్: విజయ్, డాన్స్: ప్రదీప్ ఆంథోని, దినేశ్, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X