యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిన పవన్ (అఫీషియల్)
హైదరాబాద్ : సక్సెస్ ఫెయిల్యూర్స్ కు సంభందం లేకుండా శిఖరాగ్ర స్ధాయి క్రేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటి దారేది చిత్రం విడుదల చేస్తున్నారు అనగానే యావత్తు తెలుగు ప్రేక్షకులు మరియు మెగాభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూసారు. సిస్టమ్స్ ముందు కూర్చుని రిప్రెష్ కొడుతూనే ఉన్నారు. సోషల్ నెట్ వర్క్స్ లో సైతం ఎదురుచూడటం మనం చూసాం.
వీడు అడుగుల బుల్లెట్...వీడు ధైర్యం విసిరిన రాకెట్ట్...అంటూ మెగా అబిమానుల ముందుకు దూసుకు వచ్చిన అత్తారింటికి దారేది..టీజర్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. యూ ట్యూబ్ లో గత పాత రికార్డులు తిరిగరాయటమే కాక యూ ట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణిత లు హీరోయిన్స్ గా నటించారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అత్తారింటింది దారేది. ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యిన 38 గంటల్లో ఒకే ఒక్క ఎకౌంట్ లో 4,68,564 వీవ్స్, 10,119 లైక్స్ మరియు 4727 కామెంట్స్ తీసుకున్న మెట్టమెదటి చిత్రం గా రికార్డు నెలకొల్పటం విశేషం. ఇంతటి రికార్డుని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు ,మెగాభిమానులకు మా ధాంక్స్ చెప్తున్నాము. దేవిశ్రీప్రసాద్ అందించిన ఎక్సలెంట్ మ్యూజిక్ ని జులై 19న గ్రాండ్ గా విడుదలచేసి చిత్రాన్ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అత్తారింటికి దారేది సరికొత్త రికార్డుల క్రియేట్ చేస్తుంది అని అన్నారు.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. పూర్తి వినోదాత్మక ఫ్యామిలీ చిత్రంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ నెల 19న సినిమా విడుదల చేసి, ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












