రామ్ చరణ్ ప్యాన్స్ అర్దం చేసుకోవాలి: 'రచ్చ' నిర్మాత
'రచ్చ' సాధించిన రికార్డుల్ని ప్రకటించాలని చిరంజీవి అభిమానులు ఆశపడుతున్నారు. 'రచ్చ' కొన్ని రికార్డుల్ని దక్కించుకొంది. కానీ 'మగధీర' రికార్డుల్ని అధిగమించలేదు కాబట్టి రామ్ చరణ్ అభిమానులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ''అని చెప్పారు 'రచ్చ'నిర్మాత ఎన్.వి.ప్రసాద్. ఆయన, పరాస్‌జైన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'రచ్చ' శుక్రవారంతో వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ''38 కేంద్రాల్లో 'రచ్చ' వందరోజులు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులోనే కాకుండా, తమిళనాడు, కేరళలో కూడా విడుదలై మంచి విజయం సాధించిందీ చిత్రం. దక్షిణాదిఅంతా ఈ చిత్రాన్ని విడుదలచేశాం. మన మార్కెట్‌ను పెంచుకోవాలనే చిరంజీవి సూచనమేరకు తమిలనాడు, కేరళ, కర్నాటకలో ఎక్కువ థియేటర్లు విడుదల చేసి సక్సెస్ చేశాం. చిరంజీవి అభిమానుల్ని అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. చరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలన్నదే మా ఆకాంక్ష'' అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ -''ఈ సంస్థలో మాకిది నాలుగో సినిమా. అన్నీ హిట్లే. 'ఘరానా మొగుడు' లాంటి సరదా కథతో రూపొందిన 'రచ్చ'కు స్క్రీన్‌ప్లేనే ప్రాణం. కథలో కీలకమైన మార్పు కోసం మేమంతా మూడు నిద్రలేని రాత్రులు గడిపాం. కెవిరెడ్డిగారిలా ఒకసారి అనుకుంటే స్క్రిప్ట్‌ను మార్చని సంస్థ సూపర్‌గుడ్. అలాంటిది మా విన్నపాన్ని స్వీకరించి ఒక్క మార్పు కోసం ఎంతో కష్టపడి ఒప్పించాం. అది మంచి ఫలితాన్నిచ్చింది. 'ఏమైంది ఈవేళ' తీసిన సంపత్‌నందిని అందరూ ప్రోత్సహించారు. ప్రస్తుతం ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్న తరుణంలో వందరోజులు ఆడటం, ఆ చిత్రానికి సంబంధించిన షీల్డులు అందుకోవడం మాలో మరింత ఉత్సాహాన్నిచ్చింది'' అని చెప్పారు.
చిరంజీవి మాపై పెట్టిన బాధ్యతను నెరవేర్చినందుకు ఆనందంగా ఉంది. కథ మనకు తెలిసిందే అయినా ఆకట్టుకునే కథనంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి అన్ని కారణాలు విజయానికి కలిసివచ్చాయనీ, చిరంజీవి మాపై మోపిన పెద్ద బాధ్యతను నెరవేర్చామనే తృప్తి కల్గిందని పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు అని చెప్పారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, వాకాడ అప్పారావు పాల్గొన్నారు. తమ సంస్థలో ఈ సినిమా మరో పెద్ద విజయం అని వాకాడ అప్పారావు అన్నారు.


Click it and Unblock the Notifications











