కళా దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించిన అడ్డాల చంటి, నిర్మాతగా మారి 'ఆరో ప్రాణం', 'పవిత్ర ప్రేమ', 'కృష్ణబాబు', 'బాచి', 'తిరుమల తిరుపతి వెంకటేశ' 'అల్లరి రాముడు', 'అడవి రాముడు', 'ఒక ఊరిలో..' వంటి సినిమాల్ని నిర్మించారు. ఆయనని చెల్లని చెక్కు కేసులో పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సినీ ఫైనాన్షియర్ సురేష్‌కు చెల్లని చెక్కు ఇచ్చారనేది ఆయనపై వున్న అభియాగం. చంటి తనకు చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారని సురేష్ నెల్లూరు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన కోర్టు చంటిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంటును జారీ చేసింది. దాంతో పోలీసులు ఆయనను శుక్రవారం అరెస్ట్ చేశారు.