గేమ్ ఛేంజర్‌‌పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ .. మొదటికొచ్చిన మెగా - అల్లు వార్

గత కొన్నేళ్లుగా అల్లు - మెగా అభిమానుల మధ్య ఏ రేంజ్‌లో వార్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్‌తో మొదలైన ఈ యుద్ధం గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరింది. మెగా- అల్లు అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధానికి దిగారు. అయితే అల్లు అర్జున్ సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు అల్లు కుటుంబానికి బాసటగా నిలిచారు. బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ వారిద్దరిని వ్యక్తిగతంగా కలవడంతో గొడవ సర్దుమణిగినట్లే అనుకున్నారు.

ఈ సంగతి పక్కనబెడితే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మార్నింగ్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే గేమ్ ఛేంజర్‌పై ఓ సెక్షన్ కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిందని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకున్నాయి. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్ కారణంగా దారుణమైన కలెక్షన్స్ వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

producer allu aravind made sensational comments on ram charan s game changer at thandel pre release event

దీనికి మించి సినిమా రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్‌డీ ప్రింట్ అన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో ఇండస్ట్రీ వర్గాలే షాక్ అయ్యాయి. అయితే ఇంతటి నెగిటివిటీలోనూ గట్టి ఓపెనింగ్స్ రాబట్టిన రామ్ చరణ్ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. బయట ఉన్న టాక్‌కి .. సినిమాకి అసలు సంబంధమే లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. మీరూ మీరూ కొట్టుకోండి సినిమాను మాత్రం చంపకండి అని ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ వ్యాఖ్యానించారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

ఇలాంటి వేళ గేమ్ ఛేంజర్‌ సినిమాపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరైన దిల్‌రాజుని పొగిడే క్రమంలో ఈ వారం చాలా చేసేశారు దిల్‌రాజు. ఓ సినిమాని కిందికి చూసి, ఇంకో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి చరిత్ర సృష్టించాడని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

దీంతో మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. గేమ్ ఛేంజర్ గురించి చెప్పకపోయినా ఆ కిందకి పోయిన సినిమా రామ్ చరణ్‌దేనని వారు మండిపడుతున్నారు. అటు చరణ్ సత్తా ఇది అంటూ ఓ వర్గం ఎదురుదాడికి కూడా దిగుతుండటంతో .. అల్లు అరవింద్ లేనిపోని వివాదాన్ని కెలికినట్లయ్యింది. నిజానికి ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా హుందాగా మాటలు ఉంటాయి. కాకపోతే దిల్‌రాజు గురించి ఎలివేట్ ఇచ్చే క్రమంలో ఆ మాటలు మిస్ ఫైర్ అయినట్లుగా అర్ధమవుతోంది. మరి ఈ వివాదం ఎటు వైపు టర్న్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X