twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 20 ఎకరాలు అడిగారు.. బాలయ్య నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో అనేక రకాలు విభేదాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ అభివృద్దికి హీరోలు ఎవరూ పాటుపడటం లేదు. తెలుగు హీరోలందరూ తెలంగాణలోనే సినిమాలు చేస్తున్నారు. ఏపీని ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనను నిర్మాత, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అంబికా కృష్ణ చెప్పారు. ఇటీవల జరుగుతున్న విషయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలను వెల్లడిస్తూ..

    ఏపీలో సినిమా అభివృద్ది కోసం

    ఏపీలో సినిమా అభివృద్ది కోసం

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఎవరూ రాకపోవడంతో చిన్న నిర్మాతలకు రాయితీలు ఇచ్చాం. దాంతో కొంతమంది తమ సినిమాలు ఆంధ్రలోనే రూపొందించారు. అయితే పెద్ద సినీ నిర్మాతలు ఎవరూ ఆంధ్రాలో సినిమాలు షూట్ చేయడానికి రాలేదు అని నిర్మాత, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబిక కృష్ణ అన్నారు.

    హీరోలందరికీ రిక్వెస్ట్ చేశానని

    హీరోలందరికీ రిక్వెస్ట్ చేశానని

    ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివ‌ృద్ధి కోసం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా తాను చాలా కష్టపడ్డాను అని అంబికా కృష్ణ తెలిపారు. ఆంధ్రాలో సినిమాలు షూట్ చేయాలని ప్రభాస్, గోపిచంద్, నాని, నాగశౌర్య లాంటి హీరోలను కలిసి రిక్వెస్ట్ చేయాలని సూచించారు. అయితే తన రిక్వెస్ట్‌కు కొందరు హీరోలు స్పందించారు. మిగితా హీరోలు ఎవరూ పట్టించుకోలేదు. ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు అని అంబికా కృష్ణ తెలిపారు.

    విశాఖలో 300 ఎకరాలు..

    విశాఖలో 300 ఎకరాలు..

    సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో 300 ఎకరాలు కేటాయించారు. ఆ విషయం తెలుసుకొని భూమి గురించి ఆరా తీసి.. స్టూడియోల నిర్మాణానికి చర్యలు తీసుకొన్నాను. స్టూడియోలకు భూకేటాయింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో స్టూడియో కట్టేందుకు బాలకృష్ణ 20 ఎకరాలు కావాలని అడిగారు. అలాగే ఏవీఎం, మరికొందరు నిర్మాతలు తలా 20 ఎకరాలు కేటాయించాలని దరఖాస్తు చేసుకొన్నారు అని అంబికా కృష్ణ తెలిపారు.

    బాలకృష్ణ గొప్ప మనసు ఉన్న వ్యక్తి

    బాలకృష్ణ గొప్ప మనసు ఉన్న వ్యక్తి

    ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 10కి పైగా సినిమాలు నిర్మించాను. నాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. ఆయన మనసు చాలా గొప్పది. ఆయన సమస్యలపై స్పందించే విధానం గొప్పగా ఉంటుంది. నాకు మంచి స్నేహితుడు. దైవభక్తి ఉన్న వ్యక్తి. హృదయంలో ఏం అనిపిస్తే అలానే మాట్లాడుతారు. ఒకరి వద్ద ఒక మాట, మరొకరి వద్ద ఇంకో మాట చెప్పరు అని అంబికా కృష్ణ చెప్పారు.

    బాలయ్య క్లీన్ పొలిటిషీయన్

    బాలయ్య క్లీన్ పొలిటిషీయన్

    సినీ హీరో కాకుండా రాజకీయ నేతగా బాలకృష్ణ గొప్ప సేవ చేశారు. అనంతపురం జిల్లాలో ఒక్క బిందె నీళ్లు అడిగితే.. 24 గంటలు నీళ్లు సరఫరా చేసే పథకం చేశారు. హిందుపురంలో టౌన్‌లో ప్రధాన ఏరియాలో ఎన్నో ఏళ్లుగా 10 ఎకరాలు కబ్జా చేస్తే దానిని బయటకు తీసి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అందుకే పార్టీ ఓడిపోయినా బాలకృష్ణ బంపర్ మెజారిటీతో గెలిచారు. త్వరలోనే బాలకృష్ణతో సినిమా తీస్తాను అని చెప్పారు.

    Recommended Video

    Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
    పబ్లిసిటీ కోసం పాకులాడరు

    పబ్లిసిటీ కోసం పాకులాడరు

    తన జీవితంలో బాలకృష్ణ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టినా.. ఆయన ఎప్పుడు పబ్లిసిటీ కోసం పాకులాడరు. తన నమ్ముకున్న వారి కోసం ఎంతకైనా ముందుకెళ్తారు. ఎమ్మెల్యేగా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఏనాడు మీడియాలో ప్రచారం చేసుకోరు. ఆయన చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయనను ఎప్పుడూ గెలిపిస్తాయి అని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు.

    English summary
    Producer Ambica Krishna reveals about Balakrishna real face as actor and politician. He said, Balakrishna develops Hindupur with great perspective.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X