హీరోయిన్‌ను రేప్ చేసిన నిర్మాత అరెస్ట్

వివరాల్లోకి వెళితే...
ముంబై పోలీసుల కథనం ప్రకారం.... రమేష్ సింగ్ అనే మరాఠీ సినిమా ప్రొడ్యూసర్ 33 సంవత్సరాల ఓ యువతికి తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. పూణెకు చెందిన సదరు మహిళ నార్త్ ముంబైలోని గురెగాన్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది. ఇటీవల ప్రొడ్యూసర్ రమేష్ సింగ్ ఆమెకు ఫోన్ చేసి కలిసి లంచ్ చేద్దాని, అదే విధంగా సినిమా అగ్రిమెంటుకు సంబంధించిన అమౌంట్ సెటిల్ చేస్తానని ఆమెను పిలిపించాడు.
ఆమె తన వద్దకు వచ్చాక ఫైనాన్సియర్ దహిసర్ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉన్నాడని నమ్మించి అక్కడికి తీసుకెల్లాడు. తనను అక్కడికి తీసుకెళ్లాక సింగ్ రేప్ చేసాడని సదరు మహిళ కంప్లైంట్ చేసిందని ఓషివరా పోలీస్ స్టేషన్ పిఎస్‌ఐ విజయానంద్ తెలిపారు. ఆ దారుణం జరిగిన తర్వాత అపార్టుమెంటుకు చేరుకున్న సదరు మహిళ పూణెలోని తన పేరెంట్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పిందని, పేరెంట్స్ సలహా మేరకు ఫిర్యాదు చేసారని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్మాత రమేష్ సింగ్‌ను అరెస్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











