నిజమా...అశ్వనీదత్ ?

ఇలాంటి తప్పుడు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. వీలయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటు పడాలి కానీ ప్రేక్షకులకు ఇంకా అదనపు భారాన్ని వేసే ఇలాంటి నిర్ణయాల వల్ల పరిశ్రమ మరింత దెబ్బతింటుంది. ప్రేక్షకుడికి, థియేటర్‌కు మధ్య గెలాక్సీ ఎంటర్‌టైనర్ వంటి దళారీ సంస్థల ప్రమేయం లేకుండా డైరెక్ట్‌గా థియేటర్ల నుండి ప్రేక్షకులు టిక్కెట్లు కొనుక్కునే సిస్టమ్ వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుంది. ఈ యోచనను వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలి'' అన్నారు అశ్వనీదత్.
అయితే అప్పట్లో (జై చిరంజీవ) టైములో సినిమా టిక్కెటు రేటు పెంచుకోమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జీవో తెచ్చుకున్న అశ్వనీదత్ ఇవాళ ప్రేక్షకులకు ఎక్కువ భారం పడతాయనటం,బాధపడటం గురివింద సామెతలా ఉందని కొందరు బహరింగ విమర్శలు చేస్తున్నారు. ఆ గెలాక్సీ కి ఇచ్చేదేదో తనకే ఇస్తే...ఇలాంటి డైలాగులు రావంటున్నారు. అయితే ఈ కామెంట్స్ చేసేవారు ఏది మనసులో అంటున్నా...విన్నవారు మాత్రం ఆలోచనలో పడుతున్నారు.


Click it and Unblock the Notifications











