NTR శక్తి మూవీ ఫ్లాప్‌తో అలాంటి దారుణ పరిస్థితి.. మెహర్ రమేష్‌పై అశ్వినీదత్ ఘాటైన వ్యాఖ్యలు
తెలుగు సినిమా చరిత్రలో నిర్మాతగా అశ్వినీదత్‌కు విశేషమైన స్థానం ఉంది. టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన, రికార్డు కలెక్షన్లతో చిత్రాలను అందించారు. అయితే ఓ దశలో సినిమా పరిశ్రమ నుంచి వైదొలగేందుకు నిర్ణయం తీసుకొన్నారు. చాలా కాలం సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అయితే మహానటి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు. అయితే తాను సినిమా పరిశ్రమకు దూరం కావడానికి కారణమైన దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

మహానటి సినిమా విజయంతో
మహానటి సినిమా భారీ సక్సెస్ తర్వాత అగ్ర నిర్మాత అశ్వినీదత్ మళ్లో జోష్‌తో సినిమాలు నిర్మిస్తున్నారు. వైజయంతీ బ్యానర్ పర్యవేక్షణలో స్వప్న సినిమా బ్యానర్‌లో జాతిరత్నాలు సినిమాతో మళ్లీ సక్సెస్ సాధించారు. ఆ తర్వాత సీతారామం, ప్రాజెక్టు K తదితర సినిమాలతో బిజీగా మారిపోయారు.

ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా సీతారామం
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ప్రస్తుతం రూపొందించిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముగ్గురు కుమార్తెలు ఉండటం వల్ల తన సినీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టంగా అనిపించింది. వారసుడు ఉంటే బాగుండేదనిపించింది. అయితే స్వప్న, ప్రియాంక సినీ నిర్మాణంలోకి ప్రవేశించి అద్బుతాలు సృష్టించే దిశగా అడుగులేస్తున్నారు అని అశ్వినీదత్ చెప్పారు.

నాగ్ అశ్విన్‌తో పూర్వవైభవం
అయితే నాగ్ అశ్విన్ మా ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రతిష్ట మరింత పెరిగింది. నాగ్ అశ్విన్ మా ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నారు. నాగ్ అశ్విన్ విజన్, ఆలోచన తీరు నాకు బాగా నచ్చింది. లాక్‌డౌన్‌లో జాతిరత్నాలు సినిమాకు ఓటీటీ సంస్థ నుంచి 21కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే వెంటనే ఓటీటీ ఆఫర్‌ను తీసుకోమని చెప్పాను. కానీ నాగ్ అశ్విన్ ఓటీటీ ఆఫర్‌ను తీసుకోకుండా థియేట్రికల్ రిలీజ్ చేద్దామని చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమా సాధించిన విజయంతో నాగ్ అశ్విన్‌పై నాకు మరింత నమ్మకం ఏర్పడింది అని అశ్వినీదత్ తెలిపారు.

Project K తో అంతర్జాతీయ స్థాయికి
ప్రభాస్‌తో Project K సినిమాను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా థ్రిల్ అవుతున్నారు. దీపిక పదుకోన్, ప్రభాస్‌ను డీల్ చేస్తున్నతీరు అందర్నీ ఆకట్టుకొన్నది. ప్రాజెక్ట్ K సినిమా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మారుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో విడుదల చేస్తామని చెప్పారు. అలాగే తన జీవితంలో శక్తి సినిమా నింపిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకొన్నారు.

శక్తి సినిమా ఫ్లాప్‌తో అంటూ
నా కెరీర్‌లో ఎన్నడూ లేని శక్తి సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. నాగ్ అశ్విన్ లేకుంటే మళ్లీ మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. శక్తి సినిమా ఫ్లాప్ సమయంలో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఆ సినిమా నష్టాల నుంచి బయటపడ్డాను. మెహర్ రమేష్ కొట్టిన దెబ్బకు నేను విజయవాడకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సినిమా ఫెయిల్యూర్ గురించి మనసులోని భావాలను పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











