ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో తారకరత్నకు ఆఫర్.. ఆలస్యంగా బయటపెట్టిన నిర్మాత!
నందమూరి కుటుంబంలో నటుడిగా మంచి గుర్తింపు అందుకోవాలి అని అడుగులు వేసిన వారిలో తారకరత్న ఒకరు. ఈ హీరో ఇటీవల రాజకీయాల్లో బిజీ అవ్వాలి అని ఎంతగానో ప్రయత్నాలు చేశాడు. అలాగే మంచి అవకాశాలు వస్తే సినిమాలు కూడా చేయాలని అనుకున్నాడు. ఇక తారకరత్న మరణించిన తర్వాత ఆయనకు వచ్చిన గోల్డెన్ ఆఫర్స్ గురించి ప్రస్తుతం అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల ప్రముఖ నిర్మాత కూడా తారకరత్నకు ప్రభాస్ సినిమాలో ఒక రోల్ ఇవ్వాలని మాట్లాడాలని అనుకున్నట్లుగా చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫస్ట్ మూవీ టైమ్ లో..
ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో తెలుగు పరిచయమైన తారకరత్న మొదటి సినిమా విడుదల కాకముందే ఒకేరోజు 9 సినిమాలకు సంతకం చేసి లాంచ్ కూడా చేశాడు. తప్పకుండా అతను బాలయ్య తర్వాత మంచి మాస్ హీరోగా క్రేజ్ అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో తారకరత్నకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు రాలేదు.

నిరాశ చెందకుండా..
అయితే మొదట్లో సినిమాలు ప్లాప్ అయినప్పటికీ కూడా తారకరత్న ఏ మాత్రం నిరాశ చెందకుండా తన ప్రయత్నాలు కంటిన్యూ చేశాడు. హీరోగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ అతను విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలని అనుకున్నాడు. ఊహించని విధంగా అమరావతి సినిమాలో ఒక నెగిటివ్ సైకో పాత్రలో కనిపించాడు. ఆ సినిమా అతనికి నటుడిగా నంది అవార్డు కూడా తీసుకువచ్చింది.

ఆ ఒక్క సినిమాతో..
మంచి హీరోగా సక్సెస్ కాకపోయినప్పటికీ తారకరత్నలో మాత్రం మంచి నటుడు ఉన్నాడు అని ఆ సినిమా రుజువు చేసింది. ఆ తర్వాత అతను హీరోగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసి మళ్లీ విఫలమయ్యాడు. ఏదేమైనాప్పటికీ మాత్రం మంచి పాత్రలు వస్తే అతను తప్పకుండా న్యాయం చేయగలడు అని అమరావతి సినిమా నిరూపించింది. అందుకే బాలయ్య బాబు కూడా తారకరత్నకు తన సినిమాలు ఆఫర్ ఇప్పించాలి అని అనుకున్నాడు.

బాలయ్య సినిమాలో ఛాన్స్
ఇటీవల కాలంలో తారకరత్న రెగ్యులర్ పాలిటిక్స్ లో బిజీ అవ్వాలి అని తన గెటప్ పూర్తిగా మార్చేశాడు. అయితే అతనికి నందమూరి బాలకృష్ణ 108వ సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇటీవల తెలియజేశాడు. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే తారక రత్న హాస్పిటల్లో చేరడం ఆ తర్వాత కన్ను మూయడం అంత చాలా వేగంగా జరిగిపోయింది.

ప్రభాస్ సినిమాలో ఛాన్స్
అయితే నిర్మాత అశ్విని దత్ ఇటీవల మరొక షాకింగ్ విషయాన్ని చెప్పడం జరిగింది. తారకరత్నకు ప్రభాస్ సినిమాల్లో కూడా ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో తారకరత్నకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇవ్వడానికి చర్చించడం జరిగింది అని కానీ ఆ విషయాన్ని ఇప్పటివరకు తారకరత్నకు కూడా చెప్పలేదు అని అన్నారు. అయితే ఇంతలోనే ఈ విషాదం జరగడం బాధకు కలిగిస్తుంది అని అశ్విని దత్ విచారం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











