Bandla Ganesh back to twitter: ఆయన చెప్పారు.. అందుకే మళ్లీ ట్విట్టర్‌లోకి.. బండ్ల గణేష్ క్లారిటీ

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన మాట్లాడినా.. మాట్లాడకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో ఓ సెన్సేషన్‌గానే ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల ట్విట్టర్‌కు దూరంగా ఉంటానంటూ బండ్ల గణేష్ ప్రకటించడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు హర్ట్ అయ్యారు. పలువురు నెటిజన్లు ఆయనను సోషల్ మీడియాలో కొనసాగాలని కోరారు. అయితే బండ్ల గణేష్ తాజాగా మరో పోస్ట్ పెట్టి ఫ్యాన్స్‌కు శుభవార్తను అందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

My Name is Bandla Ganesh, My God Is Pawan Kalyan
ప్రభుత్వ పరీక్షల్లో మీ స్పీచ్

ప్రభుత్వ పరీక్షల్లో మీ స్పీచ్

సోషల్ మీడియాలో బండ్ల గణేష్‌కు మంచి ఫాలోయింగ్ ఉందనడానికి ఇటీవల ఓ అభిమాని పెట్టిన ట్వీట్ అందుకు సాక్ష్యం. కాటమ రాయుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన ప్రసంగంలోని ఓ పాయింట్‌ను ప్రభుత్వ పరీక్షల్లో అడుగుతున్నారంటూ నెటిజన్ ఓ ప్రశ్నను ట్యాగ్ చేశాడు. గోపాల గోపాల సినిమా ఈవెంట్‌లో ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న దేశభక్తుడు ఎవరనే ప్రశ్నను ఇచ్చారు. మీరు చెప్పిన చాలా విషయాలు ఎగ్జామ్‌లో అడుగుతున్నారు. నీ స్పీచ్ ఇలా కూడా ఉపయోగపడుతున్నది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అది గోపాల గోపాల ఈవెంట్ కాదు.. కాటమరాయుడు అంటూ బండ్ల గణేష్ సరిద్దిద్దారు.

మై గాడ్ ఈజ్ పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయగా బండ్ల గణేష్ తన స్టైల్‌లో స్పందించారు. దేవర వేట మొదలైంది. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ పవన్ కల్యాణ్ అంటూ కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్‌‌తోపాటు తన ఫోటోను షేర్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ పెంచారు. ఇలా పవన్ కల్యాణ్ గురించి, ఆయన సినిమాలతోపాటు రాజకీయ సంఘటనలను షేర్ చేస్తూ అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తుంటారు.

నా జీవితంలో వివాదాలొద్దు..

అయితే.. ఇటీవల తాను సోషల్ మీడియాలో ట్విట్టర్‌కు గుడ్‌బై చెబుతున్నాను అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇటీవల ట్వీట్ చేస్తూ త్వరలో ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పేస్తా. ఇక నుంచి వివాదాలకు దూరంగా ఉంటాను. నా జీవితంలో ఎలాంటి వివాదాలకు తావివ్వ వద్దని నిర్ణయం తీసుకొన్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో అభిమానులు షాక్ తిన్నారు. అయితే నెటిజన్లు.. వర్షాల సీజన్‌లో మబ్బులు వస్తాయి.. సోషల్ మీడియాలో ఇలాంటివి కామన్ అన్న.. లైట్ తీస్కో అంటూ కామెంట్లు పెట్టారు.

 మనసు మార్చుకొన్న బండ్ల గణేష్

మనసు మార్చుకొన్న బండ్ల గణేష్

అయితే సోషల్ మీడియా తప్పుకోవద్దని నెటిజన్లు, తన సన్నిహితులు చేసిన సూచనలతో బండ్ల గణేష్ మనసు మార్చుకొన్నారు. తాను సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో కొనసాగుతాను అంటూ స్పష్టం చేశారు. అభిమానులు, సన్నిహితుల సూచనలను పాటిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేసి కన్ఫర్మ్ చేశారు.

జర్నలిస్టు సతీష్ బాబు గారు సలహా మేరకు అంటూ..

తాను ట్విట్టర్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకొన్నప్పుడు చాలా మంది ఒప్పుకోలేదు. అందులో జర్నలిస్టు సతీష్ బాబు గారు ఒకరు అంటూ తెలిపారు. ట్వీట్‌లో వివరణ ఇస్తూ... పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరో జు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇచ్చారు. వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను అంటూ గుడ్ న్యూస్ అందించారు.

 త్వరలో పవన్ కల్యాణ్‌తో మూవీ

త్వరలో పవన్ కల్యాణ్‌తో మూవీ

ఇక కెరీర్ పరంగా చాలా రోజుల నుంచి బండ్ల గణేష్ సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. త్వరలోనే తన దేవర పవన్ కల్యాణ్‌తో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి మరో బ్లాక్‌బస్టర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే త్వరలోనే ఈ వార్తను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X