బండ్ల గణేష్ కి రేవంత్ రెడ్డి కీలక పదవీ.. స్టార్ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే
ఓ కమెడియన్‌గా తన కెరీర్ ప్రారంభించి మొదలుపెట్టి.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్మాతగా మారారు బండ్ల గణేష్. ఇప్పుడు కోట్లాది రూపాయలు పెట్టి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీ తీయ గల సత్తా ఆయన సొంతం. తాను ఎంత ఎదిగినా.. తాను మాత్రం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనీ, పవన్ కు దేవుడులా కోలుస్తారు బండ్ల గణేష్. ఏ వేదికలపై మైక్ అందుకున్న.. పూనకాలు లోడింగ్.. మనోడి ఓవరాక్షన్ ఆ ఈవెంట్ కే సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా మారిపోతుంది.
అయితే.. సినిమాలకు కాస్త దూరంగా ఇతర బిజినెస్ చూసుకుంటున్న గణేష్. రాజకీయాలపై ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ చేరి ప్రచారం చేశారు. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందని వీర లెవల్ లో జోస్యం చెప్పారు. అంతటీతో తగ్గకుండా.. ఈసారి ఎన్నికలకు ముందు.. రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ వచ్చిన పట్టించుకోలేదు. కానీ, ఈసారి బండ్ల గణేష్ ఊహించనట్టుగానే .. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు చెక్ పడింది. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలువడం.. కాంగ్రెస్‌తో పదవులేం ఆశించకుండా చిత్తశుద్ధితో ఒక కార్యకర్తగా పని చేస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. ఇక అప్పటినుంచి ఆయన విధేయతకు మెచ్చి హైకమండ్ త్వరలో కీలక బాధ్యతలు ప్రచారం ఊపందుకుంది.

తాజా సినీనటుడు, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రాజకీయ పదవులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి ఇస్తున్నారా? అనే ప్రశ్నకు తాజాగా ఓ ప్రెస్ మీట్ ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి మీరుఅండగా నిలుచున్నారా? అని ప్రశ్నించగా.. తెలంగాణంలో తాను కేవలం కాంగ్రెస్ కార్యకర్తగా తన పార్టీని తాను సపోర్టు చేసుకున్నాననీ, తాను కాంగ్రెస్ కి ఓటేశానని అన్నారు. ఆంధ్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాడానికి తాను అండగా నిలబడలేదనీ, పవన్ కళ్యాణ్ అభిమానిని మాత్రమే. కానీ సపోర్టు చేయలేదని అన్నారు. తాను పార్టీకి అండగా నిలిచాను. తన వల్లే.. పార్టీ అధికారంలోకి వచ్చిందని మాత్రం తాను అస్సలు చెప్పుకోనని అన్నారు. తాను కాంగ్రెస్ కు, పవన్ కళ్యాణ్ కు అభిమానిని చెప్పుకొచ్చారు.

రేవంత్ తనకు కీలక పదవి ఇవ్వనున్నారా ? ప్రశ్నించగా.. తనకు ఏలాంటి పదవులు వద్దనీ, తాను సినిమాలు తీసుకుంటాననీ, ఇందులో ఉన్న ఆనందం, కిక్, మజా.. ఎందులో కూడా ఉండదనీ, ఒక్కసారి సినిమా క్లిక్ అయితే.. వచ్చే త్రుప్తి ఎందులోనూ ఉండని, అసలూ తనకు ఎలాంటి రాజకీయపరమైన పదవులు వద్దని తేల్చిచెప్పారు.


Click it and Unblock the Notifications











