Chandrababau Arrest చంపుతారా? చంపండి.. చావుకైనా సిద్దం.. చంద్రబాబు అరెస్ట్‌పై బండ్ల గణేష్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ గురించి నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన ఐటీ, ఇతర వర్గాలు ర్యాలీలో బండ్ల గణేష్ మాట్లాడుతూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పుట్టుకను ఎంత ప్రేమిస్తామో.. చావును కూడా అంతే ప్రేమించాలి. అప్పుడే జన్మకు సార్థకత ఉంటుంది అని అన్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ..

తెలుగు జాతికి పెద్ద. ఏపీ రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు. ఒక విజనరీ రాజమండ్రి జైలులో మగ్గుతుంటే తిండి ఎలా తినాలనిపిస్తున్నది. నాకు చాలా కడుపు మంటగా ఉంది. చాలా బాధగా ఉంది. మీ వెంట నిలబడే వారు ఎవరో చూసుకోండి. ఈ వెంట నడిచే వారిని పక్కన పెట్టుకొండి. మీరు మళ్లీ రాష్ట్రాన్ని ఏలుతారు. దేశాన్ని శాసిస్తారు అని బండ్ల గణేష్ అన్నారు.

Bandla Ganesh Responds On Chandrababu Arrest

ర్యాలీలు, ధర్నాలు చేస్తే చంపుతారా? చంపాలంటే చంపుకోండి. చంద్రబాబు జైల్లో పెట్టిన దాని కంటే ఎక్కువేం కాదు. శ్రీకృష్ణుడికే తప్పలేదు. శ్రీరాముడికే వనవాసం తప్పలేదు. చంద్రబాబు కోసం దేనికైనా మేము సిద్దంగా ఉన్నాం. KBR పార్క్‌లో కాకుండా.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు వదిలసి ఎవరి ఊళ్లకు వాళ్లం వెళ్లి పోదాం. ఊరిలో ధర్నాలు, నిరసనలు చేద్దాం. మన జాతి గర్వించే నాయకుడు చంద్రబాబు అని బండ్ల గణేష్ అన్నారు.

చంద్రబాబు లాంటి వ్యక్తి జైల్లో ఉంటే అన్నం తినబుద్ది కావడం లేదు. చంద్రబాబును అభిమానించే వాళ్లం అని చెప్పుకొనే వారికి చీము నెత్తురు ఉంటే బయటకు వచ్చి నిరసన చేయండి అంటూ నిర్మాత బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయాలి ఆయన సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వాళ్లకు సిగ్గు లేదు. వేరే నాయకుడైనా అరెస్ట్ అయితే ఈ పాటికి అగ్గి అయి ఉండేది. చంద్రబాబు విజన్ ద్వారా ఉద్యోగాలు పొంది, ఆయనను అడ్డం పెట్టుకొని ఎంతో సంపాదించారు. వారికి కనీసం చలనం లేదు. నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని. భువనేశ్వరి నాకు తల్లి లాంటింది. వినాయక చవితి పండుగ కూడా చేసుకోలేదు. చాలా బాధగా ఉంది.

చీము నెత్తురు ఉంటే ఊళ్లకు వెళ్లండి. మనకు సొంత ఊళ్లు లేవా? ఊరి బొడ్రాయి వద్ద నిరసన చేయండి.కేబీఆర్ పార్కు, ఓఆర్ఆర్‌పై, అమెరికాలో నిరసనలు చేయడం కాదు. సెలవులు పెట్టి ఊరికి వెళ్లి నిరసనలు, ధర్నాలు చేయండి. కరోనా వస్తే రెండు నెలలు సెలవు పెట్టలేదా? అమెరికాలో ఉన్న వాళ్లు సొంత ఊర్లోకి వచ్చి ధర్నాలు చేయండి బండ్ల గణేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X