»   » షాక్: బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ ఇలా అయ్యారేంటి? (ఫోటో)

షాక్: బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ ఇలా అయ్యారేంటి? (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు సినిమా లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదనుకుంటా. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్.... ఉన్నటుండి బడా సినిమాల నిర్మాతగా మారి అప్పట్లో అందరికీ షాకిచ్చారు. బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసి మెగా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.

2009లో రవితేజ ‘ఆంజనేయులు' మూవీతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్', ‘గబ్బర్ సింగ్', ఎన్టీఆర్ తో ‘బాద్ షా', ‘టెంపర్' లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ సినిమాలు తీసారు. ‘టెంపర్' సినిమా తర్వాత బండ్ల గణేష్ నుండి సినిమాలు ఏవీ రాలేదు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

బండ్ల గణేష్‌ కుటుంబానికి షాద్ నగర్ లో కోళ్ల ఫారం బిజినెస్ ఉంది. ఉన్నట్టుండి గణేష్ కోళ్ల ఫారంలో గుడ్లు ఏరుతూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం గణేష్ ఆర్థిక పరిస్థితి సినిమాలు నిర్మించే స్థాయిలో లేదని...అందుకే కోళ్ల ఫారం బిజినెస్ చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

Producer Bandla Ganesh picking eggs

గణేష్ ఓ రాజకీయ నాయకుడికి బినామీ అనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆయనే తెర వెనక ఉండి ఆయనతో సినిమాలు తీయించారనే ప్రచారం కూడా అప్పట్లో హాట్ టాపిక్. అయితే ఆ వార్తలను ఖండిస్తూ అప్పట్లోనే బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సదరు నేత అధికారంలో లేక పోవడం.... గణేష్ కూడా సినిమాలకు దూరం కావడం చర్చనీయాంశం అయింది.

మరో వైపు ‘నీ జతగా నేనుండాలి' సినిమాకు సంబంధించిన వ్యవహారంలో నటుడు సచిన్ జోషితో ఆర్థిక పరమైన వివాదాలు కూడా బండ్ల గణేష్ ను ఇబ్బందుల్లో నెట్టాయి. ఆయనకు ఫైనాన్స్ చేయడానికి సినీ ఫైనాన్షియర్లు ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది... ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉండటానికి కారణాలు ఇవే అనే ప్రచారం జరుగుతోంది.

English summary
Producer Bandla Ganesh Caught picking eggs in pultry farm.
Please Wait while comments are loading...