»   » అమ్మాయిల బ్రోకర్ అనే రూమర్ మీద... బండ్ల గణేష్ స్పందన!

అమ్మాయిల బ్రోకర్ అనే రూమర్ మీద... బండ్ల గణేష్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బండ్ల గణేష్... ఒక సాధారణ నటుడిగా సినీ రంగంలో కెరీర్ మొదలు పెట్టి..... తర్వాత నిర్మాతగా మారి, కోట్లాది రూపాయల బడ్జెట్ తో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్లతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.

బండ్ల గణేష్ ఎంత వేగంగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లోకి వచ్చాడో, అంతే వేగంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. దీంతో పాటు ఎన్నో వివాదాలు. ఓ పొలిటీషియన్ కి బండ్ల బినామీ అనే రూమర్ కూడా అప్పట్లో వినిపించింది. ఇక సచిన్ జోషితో వివాదం, కేసు విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం సినిమాలేవీ చేయకుండా ఫౌల్ట్రీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్న గణేష్... ఇటీవల idreampost.com ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బండ్లకు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి.

అమ్మాయిల బ్రోర్ అనే రూమర్

అమ్మాయిల బ్రోర్ అనే రూమర్

అప్పట్లో ఆయనపై అమ్మాయిల బ్రోకర్ అనే రూమర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తో ‘బంగారం' సినిమాలో నటించిన మీరా చోప్రా ఆయనపై ట్విట్టర్లో ఇలాంటి కామెంట్స్ చేసి వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసిందని, అందుకే ఆయనపై ఈ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి.

బండ్ల గణేష్ స్పందన

బండ్ల గణేష్ స్పందన

తనపై అలాంటి రూమర్ ఎలా వచ్చిందో తెలియదని, అవి పూర్తిగా నిరాధారమైన రూమర్స్ అని బండ్ల గణేష్ అన్నారు. మొత్తానికి ఈ రూమర్ మీద బండ్ల గణేష్ క్లారిటీ ఇవ్వడంతో అనుమానాలు తొలగిపోయినట్లయింది.

ఎన్టీఆర్ కు దూరం అవ్వడంపై

ఎన్టీఆర్ కు దూరం అవ్వడంపై

బాద్ షా సమయంలో ఎన్టీఆర్ తో కొన్ని విబేధాలు వచ్చాయని, కొందరు చెప్పుడు మాటలు విని తాను తప్పు చేసానని, దీంతో ఎన్టీఆర్ తనతో మాట్లాడటం మానేసాడని.... అప్పుడు జరిగిన తప్పుకు ఎన్టీఆర్ కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.

ఆ డైరెక్టర్ వెధవ.. అసహ్యం.. బండ్ల గణేష్ టార్గెట్ ఆ దర్శకుడేనా!

ఆ డైరెక్టర్ వెధవ.. అసహ్యం.. బండ్ల గణేష్ టార్గెట్ ఆ దర్శకుడేనా!

బేసిగ్గా నేను పనిచేసిన డైరెక్టర్లో ఈ మధ్యలో కాదుగానీ పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. హరీశ్ శంకర్, శ్రీను వైట్ల హిట్ కొట్టే తపన ఉన్న డైరెక్టర్లు అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. అయితే ఓ డైరెక్టర్ విషయంలో బండ్ల గణేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వెధవ, అసహ్యం...అనేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పవన్ స్పీచ్ కు త్రివిక్రమ్ రాతలు.. అవి తప్పుడు నా కొడుకుల కూతలు

పవన్ స్పీచ్ కు త్రివిక్రమ్ రాతలు.. అవి తప్పుడు నా కొడుకుల కూతలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రసంగాలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్పీచ్ రాస్తాడని అడిగిన ఓ ప్రశ్నకు నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించాడు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆ వార్త విని మా అమ్మ ఏడ్చింది.. అందుకే అతనికి దూరం.. బండ్ల గణేష్

ఆ వార్త విని మా అమ్మ ఏడ్చింది.. అందుకే అతనికి దూరం.. బండ్ల గణేష్

మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర వ్యక్తులకు బీనామీ అంటూ వచ్చిన వార్తలను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తోసిపుచ్చారు. రూ.300 కోట్ల పైగా ఆస్తులు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Producer Bandla Ganesh responds on women broker rumor. In a recent interview when he was asked about the same he condemned saying that it was baseless and false
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu