twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరీష్ శంకర్ ఓన్లీ రీమేక్ డైరెక్టర్.. అలా తీసి హిట్టు కొట్టగలడా.. బండ్ల గణేష్ ఫైర్

    |

    గబ్బర్ సింగ్ రీలీజై 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు మే 11వ తేదీన పండుగ చేసుకొన్నారు. ఎనిమిదేళ్లు క్రితం వచ్చిన ఈ చిత్రం గురించి ట్విట్టర్‌లో సంతోషంలో చర్చించుకొంటూ 8yearsofgabbarsinghysteria అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. 24 గంటల్లోనే 13 మిలియన్ల ట్వీట్లు చేసి మెగా అభిమానులు రికార్డు సృష్టించారు. ఇలా అందరూ సంతోషంలో మునిగి తేలుతుంటే ఈ గబ్బర్ సింగ్ వ్యవహారం బండ్ల గణేష్, హరీష్ శంకర్ మధ్య గట్టిగానే చిచ్చుపెట్టింది. ఇంతకు వారి మధ్య వివాదానికి కారణమేమిటంటే..

    గబ్బర్ సింగ్ గురించి హరీష్ శంకర్

    గబ్బర్ సింగ్ గురించి హరీష్ శంకర్


    గబ్బర్ సింగ్ 8 ఏళ్ల పండుగను పురస్కరించుకొని దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. నిన్నే కదా గుజరాత్ వెల్లి ఇంట్రడక్షన్ తీసింది. మొన్నే కదా పొల్లాచ్చి వెళ్లి అంత్యాక్షరి తీసింది అన్నట్టు ఉంది నాకు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీ సంవత్సరం గబ్బర్ సింగ్ జాపకాలు నాతోపాటే ఉంటున్నాయి. ఎన్నిమిదేళ్లయిందా అని అశ్చర్యపోవడంతోపాటు పవర్ స్టార్‌తో పనిచేసి అప్పుడే ఎనిమిదేళ్లయిపొయిందా అనే ఆందోళన కూడా లేకపోలేదు అని హరీష్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ప్రతి ఒక్కరికి పేరు పేరునా

    ప్రతి ఒక్కరికి పేరు పేరునా

    గబ్బర్ సింగ్ అఖండ విజయానికి ప్రతి అభిమానిని పేరు పేరునా తలచుకొంటూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా నిర్మాణంలో నాకు తోడ్పడిన నా రైటింగ్ టీమ్ రమేష్ రెడ్డి గారు.. వెగేశ్న సతీష్ గారు. నా డైరెక్షన్ డిపార్డ్‌మెంట్ రాజశేఖర్, విజయ్, బాబీ గార్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను అని హరీష్ శంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఆన్ స్క్రీన్ హీరో పవన్ కల్యాణ్

    ఆన్ స్క్రీన్ హీరో పవన్ కల్యాణ్

    ఆన్ స్క్రీన్ హీరో పవన్ కల్యాణ్ గారైతే.. ఆఫ్ స్క్రీన్ హీరో దేవీ శ్రీ ప్రసాద్ గారి సపోర్ట్, దేవీ శ్రీ ప్రసాద్ ఇంపాక్ట్ ఈ సినిమాకి మర్చిపోలేనిది. ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, ప్రతీ ఫ్రేమ్‌ను నేను అనుకొన్నదానికంటే బాగా తీర్చిదిద్దిన జయనన్ విన్సెంట్ గారికి పేరు పేరునా మరొక్కమారు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని హరీష్ శంకర్ ట్విట్టర్‌లో తెలిపారు.

    బండ్ల గణేష్ పేరు ఎత్తకపోవడం

    బండ్ల గణేష్ పేరు ఎత్తకపోవడం

    అయితే గబ్బర్ సింగ్ సినిమా వరకు అందర్నీ గుర్తు చేసుకొన్న హరీష్ శంకర్ మాత్రం నిర్మాత బండ్ల గణేష్‌ను మరిచిపోయారు. బండ్ల గణేష్‌ను ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలుకు దారి తీసింది. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్‌ డేట్‌ను పురస్కరించుకొని నిర్మాతగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. షూటింగ్ సందర్భంగా హరీష్ శంకర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. అలా ఉంటే సినిమా పూర్తయ్యేదా అని బండ్ల గణేష్ అన్నారు.

    హరీష్ శంకర్ సంస్కారమది..

    హరీష్ శంకర్ సంస్కారమది..


    అయితే గబ్బర్ సింగ్ రిలీజ్‌ డేట్ పురస్కరించుకొని అందరికీ థ్యాంక్స్ చెప్పారు. మీకు ఎందుకు చెప్పలేదనే ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానం ఇస్తూ.. అది హరీష్ శంకర్ సంస్కారం. అంతకంటే నేనేమీ చెప్పలేను. ఆయన కేవలం రీమేక్‌లు హిట్టు కొట్టగలరు. నేరుగా ఒరిజినల్ కథతో సినిమా తీసి హిట్ కొట్టమని చెప్పండి. పరిశ్రమ వదిలేసి వెళ్లిపోతాను అని ఘాటుగా స్పందించారు.

    హరీష్ శంకర్ డిప్రెషన్‌లో ఉంటే..

    హరీష్ శంకర్ డిప్రెషన్‌లో ఉంటే..

    హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశ నేను కల్పించాను. ఆ సమయంలో సినిమాలు పరేషాన్ అవుతుంటే పవన్ కల్యాణ్‌ను కల్పించిది నేనే. ఎన్టీఆర్ చేతి నుంచి పోవడంతో హరీష్ శంకర్ డిప్రెషన్‌లో ఉంటే పిలిచి అవకాశం వచ్చేలా నేను ట్రై చేశాను. ఆ విషయం ఆయనకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది అనేలా బండ్ల గణేష్ సెటైర్లు విసరడం కొత్త వివాదానికి దారి తీసేలా కనిపించింది.

    Recommended Video

    Akira Nandan Enormous Craze In Social Media
    హరీష్ శంకర్ స్ట్రయిట్ హిట్స్ ఇవే..

    హరీష్ శంకర్ స్ట్రయిట్ హిట్స్ ఇవే..


    ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ స్పందించే తీరును బట్టి ఈ వివాదం ఎటువెళ్తుందనేది తెలుస్తుంటున్నాయి సినిమా వర్గాలు. అయితే మిరపకాయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే లాంటి సినిమాలను స్ట్రయిట్‌గా తీసి హరీష్ శంకర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పరిశ్రమ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. బండ్ల గణేష్ ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు ఎందుకు చేసి ఉంటారనేది తాజాగా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

    English summary
    Producer Bandla Ganesh satires on Director Harish Shankar over Gabbar Singh: Gabbar Singh move has been completed 8 years in Tollywood, On this occassion, Pawan Kalyan movie rocks in Twitter again. In this occassion, Harish congrats every one except Producer Bandla Ganesh goes contraversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X