రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. జబర్ధస్త్ పిలుస్తోంది రా అంటూ!

దాదాపు నెల రోజులుగా తెలుగు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకునే దిశగా పయనిస్తోంది. ఏకంగా 160కి పైగా స్థానాల్లో మెజారిటీ సాధించిన కూటమి.. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చేరువగా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోజాపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే....

ఏపీలోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను సైతం దాటేసింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా నేతలను కూటమి అభ్యర్థులు ఓడిస్తున్నారు. ఇలా ఎంతో మంది ప్రస్తుతం వెనుకంజలోనే ఉండిపోయారు.

Producer Bandla Ganesh Sensational Tweet On Roja Defeat

మరీ ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా కూడా వెనుకంజలో ఉన్నట్లు తాజాగా తెలిసింది. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమెపై, టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ భారీ ఆధిక్యాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. దీంతో మరికొద్ది రౌండ్లలోనే రోజా ఓటమిని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

Producer Bandla Ganesh Sensational Tweet On Roja Defeat

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రోజా ఓటమి దిశగా సాగుతుండడంతో తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దీనిపై స్పందించాడు. ఈ మేరకు తన X (ట్విట్టర్) ఖాతాలో రోజా ఫొటోను షేర్ చేయడంతో పాటు 'జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. తద్వారా రాజకీయాలకు సెలవు ఇచ్చేసి.. మళ్లీ టీవీ షోలు చేసుకో అంటూ సలహా ఇచ్చాడు. ఇక, బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్‌పై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X