పోలీసుల అదుపులో బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే..
సినీ నిర్మాత, ప్రముఖ నటుడు బండ్ల గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో, మీడియాలోనూ వార్తలు హోరెత్తుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ), బండ్ల గణేష్ మధ్య జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఓ సినిమా విషయంలో వచ్చిన విబేదాల వల్ల పీవీపీకి, బండ్ల గణేష్ మధ్య గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

ట్వీట్లతో హోరెత్తించిన బండ్ల గణేష్.
తనకు ప్రాణ హాని ఉందని, డబ్బుల విషయంలో మోసం చేశాడని, రాజకీయ బలాన్ని చూపిస్తున్నాడని, తనను కాపాడమని ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ట్విట్టర్ వేదికగా కోరిన సంగతె తెలిసిందే. అంతటితో ఆగకుండా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

అనుచరులతో వచ్చి బెదిరింపులు..
బండ్ల గణేష్ తన అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని పీవీపీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసుల మేరకు పరారీలో ఉన్న బండ్ల గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు
బండ్ల గణేష్ అర్థరాత్రి తన ఇంటిపై అనుచరులతో దాడి చేసేందుకు ప్రయత్నించాడని, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో పీవీపీ ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ఐపీసీ 420, 448, 506 r/w 43 ipc సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈమేరకు బండ్ల గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పరస్పరం ఫిర్యాదు..
పీవీపీ, బండ్ల గణేష్ ఇద్దరూ పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదుల చేసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే అప్పటి నుంచి బయటకు రాని బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలోనూ బండ్ల గణేష్‌పై ఫిర్యాదులు..
బండ్ల గణేష్‌పై ఇలాంటి వివాదాలు, కేసుల కొత్తేమీ కాదు. నీజతగా నేనుండాలి సినిమా విషయంలో హీరో సచిన్ జోషికి, బండ్ల గణేష్‌కు భేదాభిప్రాయాలు రావడం.. ఒకరినొకరు దూషించుకున్న సంగతి తెలిసిందే. అలాగే టెంపర్ విషయంలో చెక్కు బౌన్స్ కేసు కూడా బండ్ల గణేష్‌పై నమోదైన సంగతి తెలిసిందే.
అరెస్ట్‌పై స్పందించిన బండ్ల గణేష్..
అయితే బండ్ల గణేష్ అరెస్ట్ అంటూ వార్తలు ప్రచారం అవుతోండగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తనను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదని.. విచారణ కోసం పిలవడం జరిగిందని పేర్కొన్నారు. చట్టంపై గౌరవంతో వాళ్లకు సహకరిస్తున్నానని తెలిపాడు. తనను అరెస్టు చేస్తే తానే తెలియజేస్తానని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











