అల్లు అర్జున్‌కు బండ్ల గణేష్ కౌంటర్.. అంత పెద్ద బూతు మాటతో షాకింగ్‌గా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన శైలి ప్రవర్తనతో తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో బండ్ల గణేష్ ఒకడు. ఈ ప్రొడ్యూసర్ దాదాపు రెండు దశాబ్దాలుగా అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో తనదైన రీతిలో మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో విభిన్నమైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ లైవ్‌లోనే బూతులు మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
గబ్బర్ సింగ్ రీ రిలీజ్‌తో
తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. దీంతో టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపకల్పనలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా కూడా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ కాబోతుంది.

భారీ రెస్పాన్స్‌తో రికార్డ్స్
ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. వాటికి కనిపించని విధంగా 'గబ్బర్ సింగ్' మూవీకి హడావిడి కనిపించింది. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ చిత్రానికి అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా రికార్డులు సైతం బ్రేక్ చేసేసింది.

ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌తో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన 'గబ్బర్ సింగ్' మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హడావిడి కనిపిస్తోంది. దీన్ని మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. దీనికి హరీష్ శంకర్, బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
లిమిటెడ్ ఎడిషన్స్‌లా
'గబ్బర్ సింగ్' ప్రెస్‌మీట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. 'ఈ మధ్య నా ఫ్రెండ్ వాచ్ పెట్టుకుని వచ్చాడు. అది ఎంత అని అడిగితే వాడు 'లిమిటెడ్ ఎడిషన్ 40 కోట్లు' అన్నాడు. అలాగే భగవంతుడు లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పట్టిస్తాడు. అందులో చిరంజీవి, పవన్ కల్యాణ్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ అలాంటి వాళ్లే' అంటూ చెప్పుకొచ్చాడు.
పొరపాటున బూతులు
ఆ తర్వాత బండ్ల గణేష్ కంటిన్యూ చేస్తూ.. 'మన భారతదేశంలో 130 కోట్ల మంది జనాలు ఉంటే.. అందులో లిమిటెడ్ పీసులుగా కొంత మంది ఉంటారు. వాళ్లను మనం గౌరవించాలి.. పూజించాలి.. ప్రేమించాలి కానీ.. వాళ్లనే మనలా అనుకుంటే మన అంత వెర్రి ***లు ఎవరూ ఉండరు' అన్నాడు. తర్వాత తన తప్పును గమనించి అందరికీ సారీ కూడా చెప్పాడు.
అల్లు అర్జున్‌కు అంటూ
పవన్ కల్యాణ్, చిరంజీవి వంటి వాళ్లను లిమిటెడ్ ఎడిషన్ మనుషులుగా పోలుస్తూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఈ కామెంట్లు అల్లు అర్జున్‌కు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో మెగా - అల్లు అభిమానుల వార్ మరింతగా పెరిగిపోయింది.


Click it and Unblock the Notifications











