డబ్బులే ముఖ్యం.. సినిమా ఇలా ఉంటేనే డబ్బులొస్తాయి.. అల్లుడు అదుర్స్‌ మూవీకి 50కోట్లు వచ్చినట్లే

సంక్రాంతి ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమాలు చాలా వరకు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నట్లు టాక్ వస్తోంది. వాస్తవానికి యవారేజ్ టాక్ వచ్చినా కూడా సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది. అయితే అల్లుడు అదుర్స్ సినిమాకు మొదటి నుంచి కూడా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రావడం లేదని వార్తలు రాగా ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు మాత్రం సినిమా సూపర్ హిట్ అని కలెక్షన్స్ వివరాలు మొత్తం బయటపెట్టేశారు.

థియేటర్స్ లో మాస్టర్ హంగామా (ఫొటోలు)

 చెప్పిన డేట్ కంటే ముందే..

చెప్పిన డేట్ కంటే ముందే..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాను సుబ్రహ్మణ్యం నిర్మించారు. ఇక సినిమా చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే వచ్చింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ సక్సెస్ మీట్ లో ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది.

మూడు రోజుల్లోనే 10కోట్లు

మూడు రోజుల్లోనే 10కోట్లు

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. అల్లుడు అదుర్స్ సినిమా మొదటిరోజు మూడు కోట్ల షేర్స్ ను అందించి మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అందించిన సినిమాల్లో ఒకటి. మూడు రోజుల్లోనే 10కోట్ల షేర్ ను అందించి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

సినిమా బడ్జెట్ ఎంతంటే..

సినిమా బడ్జెట్ ఎంతంటే..

ఇక సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు 32కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయ్యింది. అది కూడా హీరో రెమ్యునరేషన్ కాకుండా. సినిమాను ఎంత కాస్ట్లీగా తెరకెక్కించారో తెరపైనే కనిపించింది. ఈ సినిమాకు 21కోట్ల వరకు కేవలం సాటిలైట్ అలాగే ఆడియే ద్వారా మాకు వచ్చాయి. మా రిస్క్ కేవలం 11కోట్లు మాత్రమే.

నిర్మాతకు కావాల్సింది డబ్బులే

నిర్మాతకు కావాల్సింది డబ్బులే

ఇక ఆల్ మోస్ట్ రూ.9.70కోట్లు మూడు రోజుల్లోనే వచ్చింది. మరికొంత వచ్చింది అంటే ముందు రోజుల్లో నిర్మాతకు వచ్చేది మొత్తం కూడా లాభాలే అని చెప్పవచ్చు. ఈ సినిమా కొంతమంది కమర్షియల్ గా ఉందని అంటున్నారు. అందరికి కావాల్సింది కమర్షియలే.. నిర్మాతకు కావాల్సింది డబ్బులే. వేరే ఏమి అక్కర్లేదు. హీరో హీరోయిన్ కు కూడా డబ్బులే కావాలి.

50కోట్ల క్లబ్ లో బెల్లంకొండ

50కోట్ల క్లబ్ లో బెల్లంకొండ

ఇక ఇప్పటికే సినిమా పెట్టిన పెట్టిబడిని వెనక్కి తెచ్చేసిందని చెబుతూ.. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ తప్పకుండా50కోట్ల క్లబ్ లో ఉంటాడు. కేవలం హీరో గొప్పతనే కాదు. సోనూసూద్ అలాగే హీరోయిన్ నాభా నటేష్ ఇతర నటీనటుల గొప్పతనం ఇందులో చాలా ఉందని బెల్లంకొండ సురేష్ వివరణ ఇచ్చారు.

దిల్ రాజుకు మద్దతు పలికిన సురేష్

దిల్ రాజుకు మద్దతు పలికిన సురేష్

ఇక ఇటీవల నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను దిల్ రాజుపై చేసిన విమర్శలపై కూడా స్పందించిన సురేష్.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత అతనికి లేదని అన్నారు. 20ఏళ్ల నుంచి వాళ్ళు ఏమిటో మాకు తెలుసు. వాళ్ళు కావాలంటే డబ్బులు ఇచ్చి మరీ సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ లో ఎంతో మందికి సహాయం చేశారు. అలాంటి నిర్మాతపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని సురేష్ వివరణ ఇచ్చారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X