బాలకృష్ణ తీర్చేశారు: నల్లమలుపు బుజ్జి
రాముడంటే తెలుగువారికి రామారావుగారే గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్ తరువాత ఆ పాత్రను ఇక ఎవరూ రంజింపచేయలేరేమో అనే లోటుని బాలకృష్ణ తీర్చేశారు అంటున్నారు ప్రముఖ నిర్మాత నల్ల మలుపు బుజ్జి. రీసెంట్ గా ఆయన 'శ్రీరామరాజ్యం'చూసి ఇలా స్పందించారు.ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..బాపుగారు ఓ పెయింటింగ్‌లా 'శ్రీరామరాజ్యం'చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆయనకు పాదాభివందనం చేయాలనిపించింది.సాధారణంగా మనం అన్ని సినిమాల్ని దృశ్యకావాలుగా అభివర్ణిస్తుంటాం. కానీ అసలుసిసలైన దృశ్య కావ్యం 'శ్రీరామరాజ్యం'. రామాయణాన్ని రెండున్నర గంటల సినిమాగా మలచడమంటే ఆషామాషీ కాదు. అదీ ఈ తరానికి కూడా అర్ధమయ్యేరీతిలో. ఈ సినిమా చూసి చాలా థ్రిల్ ఫీలయ్యాను అన్నారు.
అలాగే శ్రీరాముని పాత్రలో బాలకృష్ణ అదరగొట్టేశారు. సినిమా చూసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి అభినందించాను. వాల్మీకిగా నాగేశ్వర రావుగారు, సీతగా నయనతార, లక్ష్మణునిగా శ్రీకాంత్.. ఇలా ప్రతి ఒక్కరూ పోటీ పడి నటించారు. ఇక నిర్మాత సాయిబాబాగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. డబ్బు సంపాదించాలనే ఆశతో కాకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ సినిమా తీసి తన జన్మ ధన్యం చేసుకున్నారు. ఆయన గట్స్‌కి హాట్సాఫ్' అన్నారు బుజ్జి. నందమూరి బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా నిర్మించిన 'శ్రీరామరాజ్యం' చిత్రం రెండు వారాల క్రితం విడుదలైంది.


Click it and Unblock the Notifications











