అల్లు అరవింద్‌ని కాల్చేయాలన్న కామెంట్స్‌పై రియాక్షన్.. మేము సంస్కారం పక్కన పెడితే చాలు!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం చెలరేగింది. థియేటర్స్ విషయంలో నిర్మాతలు మధ్య అగ్గి రాజేసుకుంటోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ పేట చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాతలు వల్లభనేని అశోక్, ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ లో థియేటర్ల మాఫియా రాజ్యం ఏలుతోందని వీరిద్దరూ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యానించారు. వల్లభనేని అశోక్ ఇంకాస్త ఘాటుగా దిల్ రాజు, అల్లు అరవింద్ పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ నుంచి రియాక్షన్ మొదలయింది.

మిడిమిడి జ్ఞానం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కు సన్నిహితంగా ఉండే బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అశోక్ వల్లభనేని, ప్రసన్న కుమార్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని బన్నీ వాసు వ్యాఖ్యానించారు. బన్నీ వాసు గీత గోవిందం చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
మేము తిట్టాలి అనుకుంటే
ప్రసన్న కుమార్, వల్లభనేని అశోక్ సహనం కోల్పోయే పరిస్థితి తీసుకుని వస్తున్నారు. మేము తిట్టాలి అనుకుంటే సంస్కారం అనే హద్దు దాటితే సరిపోతుంది అని బన్నీ వాసు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అరవింద్, దిల్ రాజు, యువిక్రియేషన్స్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మాఫియా సాగిస్తున్నారు అంటూ అశోక్ వల్లభనేని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పేట చిత్రానికి థియేటర్స్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

షూట్ చేయాలి
థియేటర్స్ మాఫియా నడిపిస్తున్న వారిని నయీమ్ ని షూట్ చేసినట్లు షూట్ చేయాలని వల్లభనేని అశోక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి కుక్కలకు బుద్ది చెప్పాలి అంటూ అశోక్ వల్లభనేని వేదికపై సహనం కోల్పోయారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రెండవ వారం నుంచి పేట చిత్రం దూసుకుపోతునని వల్లభనేని అశోక్ అన్నారు.

తీవ్రమైన పోటీ
ఈ సంక్రాంతి బరిలో నాలుగు బడా చిత్రాలు నిలవడంతో థియేటర్స్ సమస్య ఏర్పడింది. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ, వరుణ్ తేజ్, వెంకీ నటించిన ఎఫ్2 చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటితో పాటు రజినీకాంత్ పేట చిత్రాన్ని కూడా విడుదుల చేస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రం కానుంది.


Click it and Unblock the Notifications











