twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీత బోయ వివాదం... జరిగింది ఇదీ అంటూ బన్నీ వాసు వివరణ!

    |

    Recommended Video

    Bunny Vas Clarifies On Junior Artist Sunitha Boya Issue ||

    నటి సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్... నిర్మాత బన్నీ వాసు గురించి చేసిన ఆరోపణలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా బన్నీ వాసు మోసం చేశారని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ కల్పించుకుని తనకు న్యాయం చేయాలని ఆమె సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేయడం సంచలనం అయింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోపణలు జనం మరోరకంగా అర్థం చేసుకుని బన్నీ వాసును ఇంకో కోణంలో చూడటం ప్రారంభించారు. ఈ పరిణామాలపై తాజాగా బన్నీ వాసు వివరణ ఇచ్చారు.

    జనసేనలో పని చేశావు కాబట్టి అవకాశాలు ఇవ్వరు

    జనసేనలో పని చేశావు కాబట్టి అవకాశాలు ఇవ్వరు

    సునీత బోయ అనే అమ్మాయి నన్ను అప్రోచ్ అయిన మాట నిజమే. నేను జనసేనలో పని చేశాను, నాకేమైనా సినిమా అవకాశాలు ఇవ్వండి అని అడిగింది. ఏమైనా అవకాశాలు ఉంటే చూడండి అని మా వాళ్లకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సునీత బోయ ఒక విషయం అర్థం చేసుకోవాలి. జనసేనలో పని చేశావు కాబట్టి అవకాశాలు ఇవ్వాలి అని ఏమీ ఉండదు.

    టెస్ట్ పాసైతేనే ఛాన్స్

    టెస్ట్ పాసైతేనే ఛాన్స్

    నువ్వు మెగా అభిమానివి, మీ ఫాదర్ కూడా తెలిసిన థియేటర్లలో రిప్రజంటేటివ్ గా చేశారు కాబట్టి ఏమైనా అవకాశాలు ఉంటే ఇవ్వమని నేను కూడా చెప్పాము. మా వాళ్లు కూడా ఆడిషన్స్‌కు నిన్ను పిలిచారు, నువ్వు కూడా ఒక దానికి వెళ్లినట్లు ఉన్నావు. నువ్వు ఆడిషన్ వెళ్లి టెస్ట్ పాసైతే తప్పకుండా నీకు అవకాశం వస్తుంది. మేము అనుకున్న పాత్రకు నువ్వు సరిపోతావా? లేదా? అనేదే అక్కడ ముఖ్యం. నువ్వు బాగా చేసినా తీసుకోకూడదు అని ఏమీ ఉండదు. ఆడిషన్ అనేది ప్రాసెస్. అందులో పాసైతేనే ఛాన్స్ ఉంటుంది. మా పిల్లాడైనా అలాగే చేస్తాం.

    అందుకే పోలీసులకు కాల్ చేశాం

    అందుకే పోలీసులకు కాల్ చేశాం

    సునీత బోయ అప్రోచ్ అయిన విధానం బాగోలేదు. మొదట్లో ఆమె ప్రవర్త బాగానే ఉన్నా తర్వాత ఆఫీస్ వద్దకు వచ్చి అరిచేయడం, అగ్రెసివ్‌గా ఉండటం చూస్తుంటే ఈ అమ్మాయిని లొకేషన్ కు తీసుకెళితే సరిగా చేస్తుందా? అక్కడ కూడా ఇలాగే అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తుందా? అనే ఒక ఆందోళనకర పరిస్థితిలోకి మమ్మల్ని తోసేసింది. ఆమె అబ్ నార్మల్ బిహేవియర్ కూడా అందుకు ఓ కారణం. మా ఆఫీసు గేటు దగ్గర రాత్రి వచ్చి అరిస్తూ వారికి బయటకు రమ్మను, వీరిని బయటకు రమ్మను అంటూ గోల చేయడంతో మేము పోలీసులకు కాల్ చేయకుండా ఎవరికి కాల్ చేయాలి? లేడీ కాబట్టి అక్కడికి వెళ్లి ఆమెకు సర్ది చెప్పే పరిస్థితి కూడా లేదు.

    మీ నాన్నను మా గేటు దగ్గర వదిలేసి వెళితే ఏమనుకోవాలి?

    మీ నాన్నను మా గేటు దగ్గర వదిలేసి వెళితే ఏమనుకోవాలి?

    మీ పేరెంట్స్‌కు బాగోలేదని నువ్వు చెబితే... మేము ఏమైనా హెల్ప్ చేస్తామని కూడా చెప్పాం. ఇంతలోనే 15 రోజుల తర్వాత నువ్వు మీ పేరెంట్స్ ను తీసుకొచ్చి... మీ ఫాదర్ నడవలేడు, మాట్లాడలేడు మా గేటు దగ్గర వదిలేసి అలా వెళ్లిపోతే మేము ఏమనుకోవాలి? అయినప్పటికీ కారు ఇచ్చి అనంతపురం పంపాము, అక్కడ మీకు తెలిసిన వారు ఉంటే వారికి అప్పజెప్పాము. ఇవన్నీ మేము ఓపికతో చేస్తున్నాం. నువ్వు ఆడపిల్లవు, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నావు, కష్టపడుతున్నావు అని చేస్తున్నాం.

    ఏదైనా డిస్ట్రబెన్స్ జరిగితే లక్షల్లో నష్టం

    ఏదైనా డిస్ట్రబెన్స్ జరిగితే లక్షల్లో నష్టం

    నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలంటే ముందు నీకు ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. బ్యాలెన్స్ లేకుండా ఇలా చేస్తే ఇప్పుడే కాదు పది సంవత్సరాలైనా ఇలాగే ఉంటావు. నీ బిహేవియర్ అలా ఉంటే నిన్ను తీసుకోవడానికి కూడా భయపడతారు. సినిమా షూటింగ్ అంటే ప్రతి నిమిషం లక్షలతో వ్యవహారం. షూటింగులో ఏదైనా చిన్న డిస్ట్రబెన్స్ జరిగినా లక్షల్లో నష్టం వస్తుంది. అందుకే ఆర్టిస్టుల బిహేవియర్ చాలా అబ్జర్వ్ చేస్తాం.

    అది మోసం చేయడం ఎలా అవుతుంది?

    అది మోసం చేయడం ఎలా అవుతుంది?

    నువ్వు ఫేస్ బుక్ లో ఏదో వీడియో పెట్టి చాంబర్ కు వెళ్లినట్లు మాకు తెలిసింది. ఇపుడు ఈ ఇష్యూ చాంబర్లో ఉంది. ఆ అమ్మాయికి ఒక విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఒక సినిమా ఆఫీసులో సినిమా అవకాశాలు ఇస్తామనే మనుషులు ఉన్నారని తెలిసి కూడా... పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇదంతా చేసుకుంది. ఇంత జరిగిన తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా మాకు తెలియడం లేదు. మీడియా మిత్రులకు కూడా నేను చెప్పేది ఒకటే. దీన్ని వేరే ఏదో అనుకుంటున్నారు. ఆ అమ్మాయి ‘నన్ను మోసం చేశారు' అనే వర్డ్ వాడుతోంది. చాన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం వల్ల ఆమె మోసం అనుకుంటోంది. కానీ ఆమె ప్రాసెస్ ప్రకారం వెళ్లకుండా అవకాశాలు ఇవ్వాలి అంటే కుదరదు.

    అందుకే అవకాశాలు ఇవ్వలేక పోతున్నాం

    అందుకే అవకాశాలు ఇవ్వలేక పోతున్నాం

    మేము ఆమెను ఏదో హరాస్మెంట్ చేస్తున్నట్లు అంతా అనుకుంటున్నారు. కానీ గత మూడు నెలలుగా ఆమె వల్ల మేము స్ట్రగుల్ అవుతున్నాము. మా వల్ల నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్లే పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావ్. కత్తిపట్టుకుని కూర్చుని చచ్చిపోతాను అంటే పోలీసులు రాకుండా ఎవరు వస్తారు? రాత్రి 9 గంటలకు గేటు ముందు కూర్చుని పెద్ద పెద్ద అరుపులు అరిస్తే పోలీసులు రాకుండా ఎవరు వస్తారు? తర్వాత నువ్వే... నేను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నానో నాకే తెలియదు అంటావు. ఇలాంటి అబ్ నార్మల్ బిహేవియర్ ఉండటం వల్లే ఆమెకు పాత్రలు ఇవ్వలేక పోతున్నాం.... అని బన్నీ వాసు స్పష్టం చేశారు.

    English summary
    Producer Bunny Vasu about Sunitha Boya Issue. Her behavior was inappropriate and therefore unable to give her a chance, said Bunny.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X