Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా పేరు సూర్యపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన బన్నీవాసు
Recommended Video
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం మే 4 రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఓ పాట మినహా షూటింగ్ అంతా ముగిసినట్టు సమాచారం. అయితే కొద్దిరోజులుగా మీడియాలో నా పేరు సూర్య చిత్రంపై అనేక రకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రూమర్లను బన్నీ వాసు దృష్టికి తీసుకురాగా.. అందులో వాస్తవం లేదు అని ఆయన ఖండించారు. ఇంతకీ నా పేరు సూర్య చిత్రంపై వస్తున్న రూమర్లు ఏమిటంటే..
నాపేరు సూర్యపై రూమర్లు
కథా రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నా పేరు సూర్య చిత్రం సరిగా రాలేదు. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారు అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీంతో నా పేరు సూర్య రిలీజ్ డేట్ కూడా మారవచ్చు అని కథనాల్లో పేర్కొంటున్నారు.
రూమర్లలో వాస్తవం లేదు
నా పేరు సూర్య రూమర్లపై నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ.. సినిమా రీషూట్ చేయడం అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా ప్రకటించిన తేదీకే విడుదల అవుతున్నది. ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుడుతాయో అర్ధం కాదు అని బన్నీవాసు అన్నారు.
రూమర్లకు కారణమిదే కావొచ్చు
వాస్తవానికి ఓ పాట షూటింగ్ మిగిలి ఉంది. అనుకొన్న డేట్ కంటే ఓ వారం ఆలస్యంగా పాటను షూట్ చేస్తున్నాం. అలాంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రూమర్ క్రియేట్ చేసి ఉంటారు. అంతకంటే ఇందులో చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. అనుకొన్న తేదీకి నా పేరు సూర్య వచ్చేస్తుంది అని బన్నీవాసు క్లారిటీ ఇచ్చారు.
8న డైలాగ్ ఇంపాక్ట్ రిలీజ్
నా పేరు సూర్య చిత్రానికి సంబంధించిన టీజర్లుకు విశేషమైన స్పందన వచ్చింది. దాంతో రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 8న నా పేరు సూర్య సినిమాకు సంబంధించిన డైలాగ్ ఇంపాక్ట్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వివాదం ముగిసిందిలా
గతంలో నా పేరు సూర్య చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని భావించారు. అదే రోజు భరత్ అనే నేను రిలీజ్ డేట్ కూడా ఉండటంతో కొంత వివాదంగా మారింది. అయితే భరత్ అనే నేను, నా పేరు సూర్య నిర్మాతలు కలిసి ఈ సమస్యను పరిష్కరించుకొన్నారు. ఆ నేపథ్యంలో భరత్ అనే నేను వారం ముందుగా రీలీజ్ చేయగా, నా పేరు సూర్యను ఓ వారం వెనుకకు జరిపిన సంగతి తెలిసిందే.