టాలీవుడ్ నిర్మాత అరెస్ట్.. వందల కోట్ల భూకబ్లా ఆరోపణలు..!
టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. భూకబ్జా కేసులో ఆయనను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో స్టేట్ ఆర్కైవ్ విభాగంలో పనిచేసే రికార్డు అసిస్టెంట్ కొత్తింటి చంద్రశేఖర్, లింగమయ్య గౌడ్‌ను కూడా అరెస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
నకిలీ పత్రాల సృష్టించడం, అలాగే పాత భూపత్రాలను మార్చి కబ్జా చేశారనే ఆరోపణలపై నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణపై తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ విభాగానికి చెందిన అధికారి జరీనా పర్వీన్ ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా తార్నాక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతరం బూరుగపల్లి శివరామకృష్ణతోపాటు రికార్డు అసిస్టెంట్, మాజీ ఎమ్మెల్యేపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హజరుపరిచారు. శివరామకృష్ణను ఏ1గా, చంద్రశేఖర్‌ను ఏ2గా, లింగమయ్య గౌడ్‌ను ఏ3గా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దాంతో వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అయితే నిర్మాత బూరుగు పల్లి కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో బెయిల్ లభించింది.
అధికారి జరీనా ఫిర్యాదు ప్రకారం.. రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 46లో సుమారుగా 83 ఎకరాలు, యాచారంలోని 10 ఎకరాల మేర తప్పుడు డాక్యుమెంట్లు, పాత డాక్యుమెంట్లను ఫోర్జరీకి పాల్పడి భూకబ్జా చేశారు. కబ్జాకు గురైన భూమి వెలకట్లలేనిది. అక్రమణలకు గురైన వారిపై చర్యలు తీసుకోవాలి అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే తమపై నమోదైన కేసుపై హైకోర్టులో శివరామకృష్ణ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే వీరికి హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో ఈ కేసును సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దాంతో సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ ముగ్గురు భూకబ్జాకు పాల్పడటమే కాకుండా తప్పుడు పత్రాలను సృష్టించారనే విషయం స్పస్టమైంది. రికార్డు అసిస్టెంట్ చంద్రశేఖర్ ఈ నేరానికి పాల్పడ్డారనే కోర్టులో తేలింది.
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు సానుకూలమైన తీర్పు ఇవ్వడంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టులో హాజరుపరచగా వారికి జ్యూడిషియల్ కస్టడీ విధించడం.. ఆ తర్వాత వారు దరఖాస్తు చేసుకోవడంతో బెయిల్ కూడా లభించింది.
నిర్మాత శివరామకృష్ణ విషయానికి వస్తే.. ప్రేమంటే ఇదేరా, దరువు, యువరాజు, సీతారత్నం గారి అబ్బాయి, సర్దుకుపోదాం రండి, శ్రీరాం, ఒక చిన్న మాట, సాహస వీరుడు సాగర కన్య లాంటి చిత్రాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications











