జూ.ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్లాటినం డిస్క్ వేడుక జరపబోతున్నాం. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవుతుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటున్నారు నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలా సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. విజయ దశమి కానుకగా ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అన్నారు. ఇక ఎన్టీఆర్...వక్కంతం వంశీ కథ చెబితే నాకు బాగా నచ్చుతుంది. తను ఈ కథ చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. సురేందర్‌రెడ్డి ఈ సినిమాని అద్భుతంగా తీశాడు. సూపర్ డూపర్ అవుతుంది అన్నారు.ఊసరవెల్లిలో ఎన్ని రంగులు ఉన్నాయో ఈ చిత్రంలో అన్ని హంగులు ఉంటాయని రచయిత వక్కంతం వంశీ చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











