Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్ అభిమానులకు నిర్మాత విజ్ఞప్తి
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ....పాసులు లేని వారు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దు, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసు శాఖ ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు విడుదల చేసాం. పాసులు లేని వారు టీవీల్లో కార్యక్రమాన్ని చూడాలి, పరిస్థితి అర్థం చేసుకుని మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అన్నారు.
కాగా...పాసులు దొరకని అభిమానులు గురువారం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదట ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెగా కుటుంబంపై అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నామని, రక్తదానాలు చేసామని, అలాంటి తమకే పాసులు ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పాసులు వివిధ అభిమాన సంఘాలకు డిస్ట్రిబ్యూట్ కావడంతో నిర్వాహకులు కూడా చేతులెత్తేస్తున్నారు.
ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.