Jr NTR డిజాస్టర్ సినిమా.. ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవాలని అనిపించింది.. 35 కోట్లు లాస్: నిర్మాత
ప్రతీ స్టార్ హీరోకు కూడా వారి కెరీర్ లో ఎన్నో బిగ్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఊహించని కొన్ని దారుణమైన డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా లైఫ్ లో అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒకటైన సినిమా గురించి ఇటీవల నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అనంతరం సినిమాలు వాదిలేయాలని అనిపించింది అనే రేంజ్ లో ఆయన వివరణ ఇచ్చారు. ఇక ఆ నిర్మాత ఎవరు? ఆ సినిమా ఏది అనే వివరాల్లోకి వెళితే..
50 ఏళ్ళ అనుభవం ఉన్న నిర్మాత: ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ చలసాని.. 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో అనేక అద్బుతమైన చిత్రాలను నిర్మించారు. అతిచిన్న వయసులోనే ప్రొడ్యూసర్ గా మారిన ఇతడు... 1975లో ఎదురులేని మనిషి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యుగ పురుషుడు, అడవి సింహాలు, అగ్ని పర్వతం, బ్రహ్మ రుద్రుడు, జగన్మాత, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు అతిలోక సుందరి, అశ్వమేధం, గోవిందా గోవిందా, చూడాలని ఉంది వంటి అద్భుతమైన చిత్రాలను ప్రొడ్యూస్ చేశాడు.

ఆ సినిమాతో ఏడేళ్ళ గ్యాప్: కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్ లతో జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు. రావోయి చందమామ, చూడాలని ఉంది, రాజకుమారుడు, ఆజాద్, స్డూడెంట్ నెంబర్ వన్, ఇంద్ర, సుభాష్ చంద్రబోస్, బాలు, జై చిరంజీవ, సైనికుడు, చిరుత, కంత్రి, శక్తి, దేవదాస్, మహానటి వంటి చిత్రాలను నిర్మించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాధించుకున్నాడు. అయితే శక్తి సినిమా తర్వాత ఆయన దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నారు.

ఆ సినిమా డిజాస్టర్ కావడంతో: భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాల మధ్య నిర్మించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం శక్తి.. అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో కోలుకోని దెబ్బ తిన్నాడు. దాన్ని నుంచి ఆయన కోలుకోవడానికి ఏడేళ్ల సమయం పట్టిందట. ఈ విషయాన్ని ఆయనే నేరుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. శక్తి సినిమా వల్ల ఆయన 32 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు వివరించారు. అంత పెద్ద లాస్ తర్వాత తాను త్వరగా కోలుకోలేక పోయానని చెప్పుకొచ్చారు.

సినిమాలు వదిలేసి వెళ్లిపోదామని: ఇక ఈ సినీ ఇండస్ట్రీకి తన అవసరం లేదని, సినిమాలు వదిలేసి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నాడట. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ మళ్లీ 2018లో దేవదాస్ చిత్రంలో రీఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది మహానటి సావిత్రి బయోపిక్ ను నిర్మించాడు. అయితే మరోసారి ధైర్యంగా ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు కే చిత్రానికి భారీ స్థాయిలో బడ్జెట్ పెట్టి సినిమాను నిర్మించబోతున్నారు. శక్తి సినిమా తర్వాత ఆ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అశ్వినీ దత్ కు ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందో చూడాలి మరి.

ఇప్పుడు అతిపెద్ద భారీ ప్రాజెక్ట్!: అప్పుడు ఎన్టీఆర్ శక్తి సినిమా కోసం 50 కోట్లు పెడితే.. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ సినిమా కోసం ఏకంగా 500 కోట్లు పెడుతున్నాడట. మరి శక్తి సినిమాతో తగిలిన దెబ్బ కనీసం ప్రాజెక్టు కే తోనైనా మానుతుందో లేదో చూడాలి. సైన్స్ ఫిక్షన్ జానర్ లో వస్తున్న ఈ మూవీపై సినీ ప్రేక్షకులు అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











