చెర్రీ, బన్నీతో బాలయ్య పోటాపోటీ.... అనుష్క అందుకే చేయలేదట!
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'జై సింహా'. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కె.ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత సి కళ్యాణ్ మీడియాతో సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.

బాలయ్య నట విశ్వరూపం
‘జై సింహ' చిత్రంలో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని, బాలయ్య నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు.

రామ్ చరణ్, బన్నీ తరహాలో స్టెప్స్
టాలీవుడ్లో డాన్స్ బాగా చేసే స్టార్స్ అంటే బన్నీ, రామ్ చరణ్ పేర్లు వినిపిస్తాయి. అయితే ‘జై సింహ' చిత్రంలో వీరికి ఏ మాత్రం తీసిపోకుండా బాలయ్య స్టెప్స్ వేశారట. బాలయ్య డాన్స్ ఆశ్చర్య పరిచే విధంగా ఉంటుందని నిర్మాత సి కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు.

పవర్ ఫుల్ ప్యాకేజీ
‘జై సింహ' చిత్రం యాక్షన్, పాటలు, డాన్సులు, ఎమోషన్స్ అన్నీ కలిపిన ఒక పవర్‌ఫుల్ ప్యాకేజీ అని, అభిమానులను, కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఈ చిత్రం ఎంటర్టెన్ చేస్తుందని తెలిపారు.

ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, హిట్టే
బాలయ్య సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పండిందంటే సినిమా సూపర్ డూపర్ హిట్టే అనే సెంటిమెంటు ఉంది. 'జై సింహా' సినిమాలో కూడా అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని కళ్యాణ్ తెలిపారు.

క్లైమాక్సులో కంటతడి
‘జై సింహ' క్లైమాక్స్‌లో ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెడతాడు. ఆ స్థాయిలో ఈ సినిమాలో ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరినీ కదిలించే సన్నివేశాలు ఉంటాయి అని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు.

బ్రాహ్మణులు ఫ్యాన్స్ అయిపోతారు
మా ‘జై సింహ' చిత్రంలో పురోహితుల గురించి గొప్పగా చెప్పే సన్నివేశం ఉంది ఈ సన్నివేశం చూసిన తర్వాత బ్రాహ్మణులు బాలయ్య ఫ్యాన్స్ అయిపోతారు అని నిర్మాత వెల్లడించారు.

అనుష్క అందుకే మిస్సయింది
‘జై సింహ' సినిమాలో ముందు అనుష్కను తీసుకోవాలనుకున్నామని, అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేక పోవడంతో మిస్సయిందని, నయనతారకు ఈ కథ బాగా నచ్చడంతో తన డేట్స్ అడ్జెస్టు చేసుకుని మరీ నటించిందని సి కళ్యాణ్ తెలిపారు.

అందుకే తమిళంలో చేయడం లేదు
కెఎస్ రవికుమార్‌కు తమిళంలో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నాం. అయితే ఆయన ఈ సినిమాను అక్కడ రీమేక్ చేస్తానని అనడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నామని సి కళ్యాణ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











