twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి హీరోతో క్రాక్ సినిమా చేయాల్సింది.. కానీ అలా మిస్సయ్యింది!

    |

    టాలీవుడ్ లో ఈ ఏడాది ఫస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమా క్రాక్. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో లాక్ డౌన్ అనంతరం ఫస్ట్ హిట్ అని చెప్పవచ్చు. గోపిచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అలాంటి కథను మొదట రవితేజతో చేయాలని అనుకోలేదట. నందమూరి హీరోతో అనుకున్నట్లు నిర్మాత సి.కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

    సింగిల్ సిట్టింగ్ లోనే.. ఫిక్స్!

    సింగిల్ సిట్టింగ్ లోనే.. ఫిక్స్!

    మాస్ మహారాజా రవితేజ క్రాక్ కంటే ముందు వరకు కూడా వరుసగా అపజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎలాగైనా హిట్ కొట్టాలని డైరెక్టర్ గోపిచంద్ చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరి కాంబినేషన్ లో ఇదివరకే డాన్ శీను, బలుపు బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అంధించాయి.

    రిస్క్ చేయడానికి సిద్ధమయ్యారు

    రిస్క్ చేయడానికి సిద్ధమయ్యారు

    క్రాక్ సినిమా విడుదలయ్యే సమయంలోనే మొదటి లాక్ డౌన్ పడింది. ఆ తరువాత సినిమాకు ఓటీటీ ఆఫర్స్ చాలానే వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ రిస్క్ చేయడానికి ముందడుగు వేసింది. రిలీజ్ కోసం చాలా రోజులు వేయిట్ చేసింది. లాక్ డౌన్ అనంతరం జనాలు ఎగబడి సినిమా చూస్తారని నమ్మారు. అదే నిజమయ్యింది. 50కోట్ల కలెక్షన్స్ తో రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.

    ఆ కథ తమిళ్ సినిమా లోనిదే

    ఆ కథ తమిళ్ సినిమా లోనిదే

    అసలైతే ఈ సినిమా కథను నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించాలని అనుకున్నారు. తమిళ్ సినిమా సేతుపతి కథ ఆధారంగానే దర్శకుడు స్ఫూర్తి పొంది కథ రాసుకున్నాడని కళ్యాణ్ చెప్పారు. అయితే అంతకంటే ముందే ఆ రీమేక్ హక్కులను మేము సొంతం చేసుకున్నామని చెప్పారు. ఇక గోపీచంద్ మలినేని చెప్పిన కథ కూడా అలానే ఉంది. కానీ అతను మాస్ ఎలివేషన్స్ తో కథను మరోలా మార్చుకొని అద్బుతంగా తెరకెక్కించినట్లు చెప్పారు.

    Recommended Video

    Bigg Boss Tamil Contestant Mahat’s Girlfriend Moves Apart From Him
    బాలకృష్ణతో చేయాలని అనుకున్నప్పటికి..

    బాలకృష్ణతో చేయాలని అనుకున్నప్పటికి..

    ఇక తాము రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నప్పుడు గోపిచంద్ మలినేని - బాలకృష్ణ కాంబినేషన్ క్రాక్ సినిమా చేయాలని అనుకున్నట్లు సి.కళ్యాణ్ తెలియజేశారు. కానీ అది సెట్టవ్వక ఆ తరువాత మరొకరి దగ్గరకు వెళ్లినట్లు తెలిపారు. ఇక వివి.వినాయక్ - బాలకృష్ణ సినిమాపై కూడా చర్చలు జరిగాయని చెబుతూ కథ ఫైనల్ అవ్వక ఆగిపోయినట్లు వివరణ ఇచ్చారు.

    Read more about: krack raviteja tollywood
    English summary
    Krack is the first box office hit of this year in Tollywood. It was the first hit after the lock down not only in Tollywood but in the entire Indian film industry. It is known that Gopichand Malineni directed this film. I never thought of doing such a story with Ravi Teja at first. Producer C. Kalyan explained in a recent interview that he thought of Nandamuri with Hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X