సుమన్ అప్పట్లో జైలుకు వెళ్ళడానికి కారణమిదే.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన సీనియర్ నిర్మాత

సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సుమన్ గురించి తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరు. కథానాయకుడిగానే కాకుండా ఎన్నో సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించిన సుమన్ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వస్తున్నారు. రౌడి క్యారెక్టర్ అయినా డేవోషనల్ పాత్రలైనా సరే తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఒకనొక సమయంలో ఆయన అనుకోని విధంగా జైలుపాలయ్యారు. దాని వెనుక కారణం ఎవరికి సరిగ్గా తెలియదు. ఇక ఇటీవల సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఒక చిన్నపాటి వివరణ ఇచ్చారు.

 సుమన్ అనగానే..

సుమన్ అనగానే..

సుమన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు నేటి భారతం, సితారా, కొండపల్లి రాజా, బావ బావమరిది వంటి ఎన్నో క్లాసికల్ సినిమాలు గుర్తొస్తాయి. 1979లో ఒక తమిళ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సుమన్ ఆ తరువాత టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సౌత్ బెస్ట్ హీరోగా చక్రం తిప్పారు.

 సుమన్ గట్టి పోటీని ఇచ్చాడు

సుమన్ గట్టి పోటీని ఇచ్చాడు

ఒక విదంగా రజనీకాంత్ కమల్ హాసన్ అంతగా క్లిక్కవ్వని సమయంలో సుమన్ అటు తమిళ్ ఇటు తెలుగులో సమానమైన బిజినెస్ అందుకుంటూ వచ్చాడు. బెస్ట్ అందగాడిగా కూడా సుమన్ మహిళల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. రెండు ఇండస్ట్రీలలో అగ్ర హీరోలకు సుమన్ గట్టి పోటీని ఇచ్చాడనే చెప్పాలి.

ఊహించని విధంగా అరెస్ట్..

ఊహించని విధంగా అరెస్ట్..


అయితే కెరీర్ స్టార్ట్ చేసిన అనంతరం 12 ఏళ్ళకు పైగా సుమన్ సౌత్ లో స్టార్ హీరోగానే మంచి హిట్స్ అందుకుంటూ వచ్చాడు. ఇక అతను కెరీర్ పై కొంత ఫోకస్ పెడుతున్న సమయంలోనే ఊహించని విధంగా అరెస్ట్ అయ్యాడు. ఆ విషయంలో అప్పట్లో నమ్మలేని రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. నిజానికి ఏం జరిగిందనే విషయం ఇప్పటికి ఎవరికి సరిగ్గా తెలియదు.

Recommended Video

Ys Jagan పై మూవీ ఉంటుంది, Pawan Kalyan ని హ్యాండిల్ చెయ్యలేను - RGV || Filmibeat Telugu
 అంతకుమించి ఏమి జరగలేదు

అంతకుమించి ఏమి జరగలేదు


ఇక ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ సింపుల్ గా ఒక వివరణ ఇచ్చేశాడు. నిజానికి సుమన్ చాలా మంచివాడు అంటూ అతను జైలుకి కావాలని కొంతమంది అగ్ర హీరోలే పంపించారని వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇక సుమన్ తన స్నేహితుల వద్ద ఒక గొడవలో నోటి దురుసు కారణంగానే విషయం కోర్టు వరకు వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. అంతకుమించి ఏమి జరగలేదని సుమన్ క్యారెక్టర్ కూడా అతని అందంలానే స్వచ్చంగా ఉంటుందని సి.కళ్యాణ్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X