Dil Raju Vs C Kalyan ఛాంబర్ వాళ్ల బాబు సొత్తా? దారుణంగా దోపిడి.. తప్పైతే చెప్పుతో కొట్టండి.. సీ కల్యాణ్
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల వ్యవహారం వేడి వేడిగా కొనసాగుతున్నది. దిల్ రాజు ప్యానెల్, సీ కల్యాణ్ ప్యానెల్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. దాంతో ఈ ఎన్నికల వాతావారణం ఆసక్తికరంగా మారింది. మా ప్యానెల్ గెలిస్తే.. ఆర్థికంగా చితికి పోయిన నిర్మాతలకు పెన్షన్, ఇన్సూరెన్స్ తదితర వసతులు కల్పిస్తాం అని సీ కల్యాణ్ అన్నారు. జూలై 30వ తేదీన జరుగుతున్న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ..
సేవ చేయడానికే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో 1600 మందికి ఓటు హక్కు ఉన్న వాళ్లు ఉన్నారు. చాలా మంది సినిమాలు తీసి జీవితంలో నష్టపోయి సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న వాళ్లు ఉన్నారు. వారిలో కొంత మంది మాకు టచ్‌లో ఉన్నారు. మా ప్యానెల్ గెలిస్తే.. ఆర్థికంగా చితికి పోయిన నిర్మాతలకు పెన్షన్, ఇన్సూరెన్స్ తదితర వసతులు కల్పిస్తాం అని సీ కల్యాణ్ అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ..

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల విషయంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొందామని దిల్ రాజు ప్రతిపాదన తెచ్చారు. మొత్తం 12 మందికి గాను.. మీరు 6 గురు సభ్యులను, మేము 6 గురు సభ్యులను నామినేట్ చేసి ఏకగ్రీవంగా ఎన్నుకొందామని చెప్పాను. అయితే గత ఎన్నికల్లో ఇలాంటి ప్రతిపాదన చేసి మమ్మల్ని గెలువకుండా కుట్ర చేశారు. దిల్ రాజు చెబితే నేను మా ప్యానెల్‌ను ఉపసంహరించుకొన్నాను. కానీ వాళ్లు మాకు మోసం చేసి వాళ్ల ప్యానెల్‌ను గెలిపించుకొన్నారు అని సీ కల్యాణ్ అన్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో వారి వర్గంలోని నలుగురుని దిల్ రాజు హ్యాండిల్ చేయలేకపోయారు. పనికి రాని సుధాకర్ రెడ్డిని, వీర్ని నాయుడు లాంటి వాళ్లను ఆపలేకపోయారు. వారు కూడా ప్యానెల్ పెడుతామని అన్నారు. ఛాంబర్ వాళ్ల బాబు సొత్తు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు చెప్పింది వినాలా? ఓటర్లు చెబితే వింటాం. అలాంటి వాళ్లను హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ఈ ఎన్నికలు అనివార్యమయ్యారు.
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించాను. కానీ దిల్ రాజు వల్ల ఎన్నికల తప్పనిసరి అయ్యాయి. చిన్న సినిమా నిర్మాతలు పరిస్థితి దారుణంగా ఉంది. ఛాంబర్ పనితీరు కుంటుపడింది. నేను వ్యాపారం చేయడం లేదు. నేను సేవ చేయడానికే నేను ఛాంబర్‌లో ఉన్నాను అని సీ కల్యాణ్ చెప్పారు.

మా ప్యానెల్‌లో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన నిర్మాతలు ఉన్నారు. వాళ్లంతా సినిమాలు తీసి డబ్బు పోగొట్టుకొన్న వాళ్లే. ప్రజల సొమ్ము దోచుకొన్న వాళ్లు కాదు. అలాంటి దోపిడిని అరికట్టేందుకు మేమంత ఏకమయ్యారు. గిల్డ్ పేరుతో భారీగా దోపిడి జరుగుతున్నది. దిల్ రాజ్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. గిల్డ్ పేరుతో దోపిడి జరుగుతున్నది. నేను తప్పు మాట్లాడితే నన్ను చెప్పుతో కొట్టండి అని సీ కల్యాణ్ అన్నారు.
దిల్ రాజుతో నాకు ఎలాంటి యుద్ధం లేదు. నా సినిమా వాళ్ల డిస్ట్రిబ్యూటర్ నుంచి రిలీజ్ కాలేదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే నాకు ఆయన ప్రత్యర్థి. గుత్తాదిపత్యం, స్టూడియోల వ్యాపారం వల్ల పరిశ్రమ బీటలు వారుతోంది. మాకు ఈ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని లేదు. మందు విందు పొందు అనేది మాకు అలవాటు లేదు. మాది పూర్ ఫ్యూర్ ప్యానెల్'' అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్; అశోక్‌కుమార్, మద్దినేని రమేశ్, నట్టి కుమార్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











