భానుతో నాకు నాలుగేళ్ళ పరిచయమే..నిర్మాత సి.కళ్యాణ్
రక్త చరిత్ర రెండు భాగాలను హత్యకు గురైన మద్దెల చెరువు సూరి డబ్బులతోనే సి.కళ్యాణ్ తీశాడని రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ ఆయనను ఫోన్‌లో సంప్రదించింది. దానికి సమాదానంగా కళ్యాణ్ మాట్లాడుతూ...నేను ఎప్పటినుంచో సినిమాలు తీస్తున్నాను. మరి ఆ సినిమాలన్నీ రవి, భాను ఫైనాన్స్ చేస్తే చేశానంటారా? అప్పటికి భాను ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. నాలుగేళ్ళ నుంచి ఆయన ఇతర వ్యాపారాలరీత్యా తెలుసు అని ఛానల్ వారితో స్పందించారు. మీరేం అనుకుంటారో అనుకోండి. వాస్తవం మాత్రం ఇదే అన్నారు.
అలాగే భానునే కాల్పులు జరిపాడని మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అసలు భానుతో ఆరోజు మధ్యాహ్నమే నేను మాట్లాడాను. సాయంత్రం 4గంటలకు తను నన్ను కలవాల్సి ఉంది. టైమ్ అయినా రాకపోయేసరికి ఫోన్ చేశాను. స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి అర్జంటుగా నువ్వురావాలి అని ఫోన్ చేశాడు. మరోవైపు నుంచి కొందరు స్నేహితులు...అంత రిస్క్ వద్దు..లేనిపోనివి మీడియా ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే విరమించుకున్నాను అన్నారు.
ఇక రక్త చరిత్ర-3ని తీస్తారా అని ఆ ఛానల్ వారు అడిగితే..మరో కోటిరూపాయలు నష్టపోతేగానీ మీకు ఆనందంగా ఉండదా అంటూ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక పరిటాల రవి, సూరికి చాలా దగ్గరివాడిగా చలనచిత్రరంగంలో సి.కళ్యాణ్ కు పేరుంది. ప్రస్తుతం బాలకృష్ణతో దాసరి దర్సకత్వంలో పరమవీర చక్ర చిత్రం తీసి సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











