నిర్మాతల రక్తం తాగుతున్నారు.. మందు, విందు, పొందు అంటూ దిల్ రాజు ప్యానెల్‌పై సీ కల్యాణ్ ధ్వజం

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుండటంతో దిల్ రాజు, సీ కల్యాణ్ ప్యానల్‌ మధ్య పోటీ రంజుగా సాగుతున్నది. రెండు ప్యానెల్స్ కూడా ఒకరికొకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో పోటాపోటిగా ప్రెస్‌మీట్స్ నిర్వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత సీ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

ప్రముఖ దాసరి నారాయణరావు గారి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగాను. నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చాం. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నాం. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తాం అని సీ కల్యాణ్ అన్నారు.

Producer C Kalyan fire on Dil Raju Panel

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట నిర్మాతలకు మెడిక్లైమ్ తీసుకొచ్చింది నేనే . నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టింది. గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనం అయ్యింది. నేను ఈ దఫా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉంది అని సీ కల్యాణ్ తెలిపారు.

గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నా. 2 లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన పరిస్థితి నేను ఎదుర్కొన్నా. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది.పెద్ద సినిమాలకు ఎక్కువ మంది పనిచేయరు. చిన్న సినిమాలను బతికించాలి అని సీ కల్యాణ్ అన్నారు.

ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. సినీ పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలి. ఎన్నికల్లో ఆ నిర్మాతలు పోటీ చేయరు, ప్రతిపాదిస్తారు, బెదిరిస్తారు. నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలను డైలాగ్స్ చెప్పడం కాదు ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి. ఆస్కార్ నిర్మాత దానయ్య, బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డను ఎందుకు నిలబెట్టడం లేదు. ఫిల్మ్ ఛాంబర్ కు సేవ చేసేవాళ్లు కావాలి. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారు అని సీ కల్యాణ్ అన్నారు.

ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంది, వ్యక్తులకు కాదు. బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు.ఎన్నికల్లో పోటిపై దిల్ రాజును కలిసి మాట్లాడాను. గిల్డ్ లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు తీవ్రస్థాయిలో సీ కల్యాణ్ మండిపడ్డారు.

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో విందు, మందు, పొందుతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూడటం లేదు. మా ఎజెండా, హామీలతో ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మందు పోసి ఓట్లు వేయించుకొన్నాం. ప్రొడ్యూసర్ల నుంచి దోచిన డబ్బు మా వద్ద లేదు. చిన్న నిర్మాతలకు మేలు చేయాలి, సేవల చేయాలనే ఉద్దేశంతోన ఎన్నికల బరిలో దిగాం. మేము పేదరికంతో బాధపడే నిర్మాతలున్నారు అని సీ కల్యాణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X